సమ్మక్క సారక్కల దర్శనం ప్రజల అదృష్టం.
గేట్ కారేపల్లి పూజారి పెండకట్ల గురమ్మ .
ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, జనవరి 28 : సింగరేణి మండలం గేట్ కారేపల్లి గ్రామంలో కొత్తూరు కాలనీ చేరువైనా కొలువైన సమ్మక్క సారక్కల గద్దెల పైకి ఆ తల్లీని ప్రతీష్టించటం జరిగింది. గ్రామ పూజారి పెండకట్ల గురవమ్మ తల్లీ అనుగ్రహం తో గ్రామ వీధుల్లో ఇంటింటి పసుపు, కుంకుమ, బోనాలతో గ్రామ ప్రజలు తల్లీకి బ్రమ్మ రథం పడుతూ డప్పుల దరువులతో, తల్లీ పునకాలతో గ్రామ ప్రజల సహకారం తో సమ్మక్క సరలక్కల ను గద్దెలపై ప్రతీష్టించటం జరిగింది. పూజారి గురవమ్మ తల్లీ గురించి భక్తజనాలకు తన చరితను వివరించడం జరిగింది. సమ్మక్క-సారక్క (సారలమ్మ) 13వ శతాబ్దంలో కాకతీయ పాలకుల అన్యాయపు పన్నులకు వ్యతిరేకంగా పోరాడి, తమ ప్రజలను కాపాడుతూ ప్రాణత్యాగం చేసిన గిరిజన వీరవనితలు. తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి, జంపన్న వాగు సమీపంలో జరిగే ఈ జాతర, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా (కుంభమేళాగా) ప్రసిద్ధి చెందింది అనీ. సమ్మక్క సారక్క మేడరాజు అనే గిరిజన దొర పులితో ఆడుకుంటున్న ఒక చిన్నారిని (సమ్మక్క) చేరదీసి పెంచాడు. సమ్మక్క మేడారం పాలకుడు పగిడిద్దరాజును వివాహం చేసుకుంది. వారికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే పిల్లలు కలిగారు. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు గిరిజనులపై అన్యాయంగా పన్నులు విధించినప్పుడు, కరువు కాలంలో వాటిని చెల్లించలేక గిరిజనులు ఇబ్బందులు పడ్డారు అంటూ, పగిడిద్దరాజు యుద్ధంలో చనిపోవడంతో, సమ్మక్క సారలమ్మ, జంపన్నతో కలిసి కాకతీయులపై పోరాటం చేసింది.
ఈ యుద్ధంలో సారలమ్మ, జంపన్న చనిపోయారు. జంపన్న రక్తం చిందిన వాగు 'జంపన్న వాగు'గా పిలవబడుతోంది అంటూ కన్నీరుతో తీవ్రంగా గాయపడిన సమ్మక్క, చిలకలగుట్ట వైపు వెళ్ళి కుంకుమ భరిణెగా మారి అదృశ్యమైందని గ్రామ ప్రజలకు వివరించటం జరిగింది. ప్రతి రెండేళ్లకొకసారి మేడారంలో 4 రోజుల పాటు జాతర జరుగుతుంది. భక్తులు అమ్మవార్లకు 'బెల్లం' (బంగారం) నివేదిస్తారు అనీ గిరిజన సాంప్రదాయాల ప్రకారం, ఎటువంటి వేద మంత్రాలు లేకుండా ఈ జాతర జరుగుతుంది అనీ ఎంతో చక్కగా పూజారి గురవమ్మ భక్త జనులకు వివరించటం జరిగింది. ఈ కార్యక్రమం లో లోకల్ గైడ్ రిపోర్టర్ సంపత్ , మూడు శ్రీను,తరాల వెంకన్న, తల్లూరి అప్పారావు, వార్డ్ నెంబర్ కుసుమ నాగరాజు, వారికోళ్లు వీరభద్రం, నూకల వెంకటయ్య, మూడు రవీందర్, పొట్లకాయ యాకుబ్, షేక్. హాజీమియా, తదితరులు పాల్గొన్నారు.
