ప్రతిభకు ఘనమైన వేడుక మాంట్‌ఫోర్ట్ ఫియెస్టా
ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాలు
ఖమ్మం:లోకల్ గైడ్:
ఖమ్మం : స్థానిక గుట్టల బజార్ ఏరియా లోని మాంట్ ఫోర్ట్ హై స్కూల్లో విద్యా రంగానికి చిరస్థాయిగా నిలిచిన సంస్థ స్థాపకులు సెంట్ లూయిస్ మాంట్ ఫోర్ట్ 353వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించబడ్డాయి . ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి, సెంట్ లూయిస్ మాంట్ ఫోర్ట్ సేవలు , ఆయన విద్యా తత్వం , నైతిక విలువలపై అవగాహన కల్పించారు . విద్యార్థులు ప్రసంగాలు , సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఆయన ఆశయాలను ప్రతిబింబించారు . పాఠశాల యాజమాన్యం బ్రదర్ జాన్ పాల్ మాట్లాడుతూ మాట్లాడుతూ విద్యతో పాటు విలువలను పెంపొందించడమే మాంట్ ఫోర్ట్ ముఖ్య లక్ష్యమని , ఆ ఆదర్శాలను కొనసాగించేందుకు మాంట్ ఫోర్ట్ స్కూల్ కట్టుబడి ఉందని తెలిపారు . పాఠశాల వార్షికోత్సవ వేడుక , సెంట్ లూయిస్ మాంట్ ఫోర్ట్ జయంతి సర్వతోముఖాభివృద్ధిని ప్రతిబింబించేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు , నృత్యాలు , గీతాలు నిర్వహించబడాయి . విద్యా , క్రీడా , సహపాఠ్య కార్యకలాపాలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు , మెరిట్ సర్టిఫికెట్లు ప్రదానం , మరియు మరింత ఉన్నత స్థాయికి చేరేందుకు పూర్వ విద్యార్థులకు సన్మానం మరియు వివిధ విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన హౌస్‌కు ఓవరాల్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీ అందజేశారు . ఈ వేడుకల్లో బ్రదర్ జోష్ , బ్రదర్ థామస్ , ఉపాధ్యాయుని , ఉపాధ్యాయులు , విద్యార్థిని , విద్యార్థులు , పేరెంట్స్ మరియు అధిక సంఖ్యలో పూర్వ విద్యార్థుల బ్యాచ్ ఆర్ జె సి కృష్ణ , అర్లప్ప , లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు .
