జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా

శేరిలింగంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన సదస్సు

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా

శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భేల్ టౌన్‌షిప్‌లో విద్యార్థులకు ఓటరు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కవిత అధ్యక్షత వహించగా, విశ్రాంత ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పూలపల్లి వెంకటరమణ ముఖ్య అతిథిగా పాల్గొని భారత ఎన్నికల కమిషన్ విధులు, అధికారాలు, ఓటు హక్కు ప్రాధాన్యతపై వివరించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి పౌరుడు నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించాలని, 18 సంవత్సరాలు నిండిన యువత ఫారం-6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఓటు హక్కు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అభిజిత్, అధ్యాపకులు డాక్టర్ అనురాధ, ప్రజ్వల,  జనార్ధన్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అమ్మయ్య చౌదరి, శివరామ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల. మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య
అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్‌’.. ప్రచారానికి ‘శ్రీకారం
కాంగ్రెస్ బీఫాం విషయంలో క్యాంపు కార్యాలయం వద్ద ఉత్కంఠ..
నాలుగో వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోరుగా ప్రచారం.
సి ఎం నిర్ణయంతో "హరి"నారాయణ
తిరుపతమ్మ తల్లి మాలదారుల ఇరుముడి కట్టు