ఇంటి వద్దే సైబరాబాద్ పోలీసుల ఎఫ్‌ఐఆర్ నమోదు

-కొత్త ఎస్‌ఓపీ అమలు..సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం.రమేష్ రెడ్డి

ఇంటి వద్దే సైబరాబాద్ పోలీసుల ఎఫ్‌ఐఆర్ నమోదు

సైబరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బాధితులకు మరింత సౌలభ్యం కల్పించేలా ఇంటి వద్దే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ)ను అమలలోకి తీసుకొచ్చారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గాగిళ్లపూర్ గ్రీన్‌వుడ్స్ విల్లాలో జరిగిన దొంగతనం ఘటనలో, పోలీసులు సంఘటన స్థలానికే చేరుకుని ఫిర్యాదు స్వీకరించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కాపీని అక్కడికక్కడే బాధితుడికి అందజేశారు. ఈ విధానాన్ని సమర్థంగా అమలు చేసిన దుండిగల్ ఇన్‌స్పెక్టర్ పి.సతీష్‌,  సిబ్బందిని సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం.రమేష్ అభినందించారు. ఈ కొత్త విధానం ద్వారా మహిళలు, చిన్నారులు, దొంగతనం, చైన్ స్నాచింగ్, రాబరీ, పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, శారీరక దాడులు వంటి కేసులలో బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే 100 లేదా 112కు సమాచారం ఇస్తే సరిపోతుంది. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఫిర్యాదు, స్టేట్‌మెంట్లు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్ కాపీని అక్కడే అందజేస్తారు. బాధితుల గౌరవం, హక్కులను కాపాడుతూ మానసిక ఒత్తిడి తగ్గించడమే ఈ విధాన లక్ష్యమని సీపీ పేర్కొన్నారు.

Tags:

About The Author

Latest News

మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల. మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య
అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్‌’.. ప్రచారానికి ‘శ్రీకారం
కాంగ్రెస్ బీఫాం విషయంలో క్యాంపు కార్యాలయం వద్ద ఉత్కంఠ..
నాలుగో వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోరుగా ప్రచారం.
సి ఎం నిర్ణయంతో "హరి"నారాయణ
తిరుపతమ్మ తల్లి మాలదారుల ఇరుముడి కట్టు