సృజనాత్మకతను చాటుకున్న మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాల విద్యార్థులు
క్లబ్ యాక్టివిటీ లో విద్యార్థినుల నైపుణ్యం అందుబాటులో ఉన్న వస్తువులతో కళాత్మక రాఖీ లు తయారీ
By Ram Reddy
On
విద్యార్థులను అభినందించిన ప్రిన్సిపాల్
పాల్వంచ(లోకల్ గైడ్):పర్యావరణ పరిరక్షణకు తమవంతుగా పాల్వంచ మహాత్మా జ్యోతిబాపూలే బాలికలు పాఠశాలలో అందుబాటులో ఉన్న వస్తువులను ఉపయోగించి రాఖీలు తయారుచేసి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. శనివారం పాఠశాలలో క్లబ్ యాక్టివిటీ లో భాగంగా విద్యార్థులు
పాఠశాల ఆవరణలో ఉన్న పువ్వులు, కొబ్బరి ఆకులు, రంగుల పెన్సిల్ లు, కాగితాలు వంటివి ఉపయోగించి వినూత్న పద్ధతిలో రఖీలను తయారుచేసి అందరినీ ఆశ్చర్యపరిచేలా చేసారు. విద్యార్థుల సృజనాత్మకతను పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్.ఏ. క్రాంతి అభినందించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...విద్యార్థులు చదువుతో పాటు వివిధ రూపాలలో వారిలో దాగివున్న ప్రతిభను వెలికి తీసేందుకు క్లబ్ యాక్టివిటీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, తద్వార విద్యార్థులలో దాగివున్న వివిధ కళలను గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. అందుకుగాను విద్యార్థులకు ఉపాధ్యాయులు పూర్తి సహకారాన్ని అందించి వారిని ఉన్నత విద్యార్థులుగా తీర్చిదిద్దే భాధ్యత ఉపాధ్యాయులుగా మనపైన ఉందన్నారు. దీంట్లో భాగంగానే రోజుకు ఒక యాక్టివిటీ ని నిర్వహిస్తూ మెహిందీ, రంగోలి, డ్రాయింగ్, క్రాఫ్ట్, హెయిర్ స్టైల్, సబ్జెక్టు లకు సంబంధించిన క్లబ్ యాక్టివిటీలు, పద్య రచన, పాటల పోటీలు, వ్యాసరచనలు వంటివి నిర్వహిస్తున్నామని, చదువుతో పాటు భవిష్యత్తులో ఉపయోగపడే ఇతర వృత్యంత కోర్సులు విద్యార్థులు నేర్చుకోవడానికి దోహదపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎటిపి అనూష, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.Tags:
About The Author

Latest News
10 Aug 2025 20:48:39
హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా వరదలతో ముంపు ప్రాంతాలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. అమీర్‌పేట్ బుద్ధనగర్, మైత్రివనం, బాల్కంపేట తదితర ప్రభావిత...