భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి.( లోకల్ గైడ్)
భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు.వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రం లోని మహిళ డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ
విచక్షణా రహితంగా చెట్లను నరికి వేయడం, అడవుల నిర్మూలన, తదితర కారణాలవల్ల కాలుష్యం పెరిగిపోయి మానవ మనుగడకు ముప్పు ఏర్పడుతుందని ,
ఇది భావి తరాలకు దుష్పరిణామాలనిస్తాయని అన్నారు. అందువల్ల భావి పౌరులైన విద్యార్థులు స్థలాలు ఉన్న ప్రతి చోట మొక్కలు నాటడమే కాకుండా, వాటికి క్రమం తప్పకుండా నీళ్లు
పోస్తూ కాపాడాలన్నారు. మహిళలు బాగా చదువుకోవాలని ,పరిస్థితులకు తగ్గట్టుగా
స్పందించాలని,మహిళ దృఢంగా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుందని, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా స్పందించాలో ఆలోచించాలని, ఇందుకు చదువు ఒకటే మార్గం అని అన్నారు. నల్గొండ మహిళా డిగ్రీ కళాశాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని,గత మార్చిలో డిజిటల్ తరగతులను ప్రారంభించడం జరిగిందని,బయోటెక్నాలజీ వంటి కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం జరుగుతున్నదని తెలిపారు.కనగల్ తిప్పర్తి లలో జూనియర్ కళాశాలలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. జూనియర్ కళాశాల స్థాయిలో మధ్యలో కళాశాల మాని వేసే వారినే కాకుండా ఇతరులు కూడా నేరుగా రామగిరి డిగ్రీ కళాశాలలో చేరవచ్చని వెల్లడించారు .
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ , తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
About The Author
Related Posts
