మౌలిక సదుపాయాలు కల్పిస్తా మంచిగా చదువుకోండి.
కస్తూరిబా విద్యార్థినులకు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి భరోసా.
By Ram Reddy
On
62 లక్షల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన.కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి .
నల్లగొండ. లోకల్ గైడ్ :

ప్రభుత్వ విభాగానికి చెందిన ఇంజనీర్లు వేసిన ఇంజనీర్ ప్లానను పరిశీలించి.. విద్యార్థునుల భవిష్యత్తు కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రెడీ చేయించి పనులు మొదలు పెడతామన్నారు.ఇప్పటికే తన వ్యక్తిగత ఇంజనీరింగ్ బృందంతో ఎటువంటి మౌలిక సదుపాయాలు అవసరం అనే విషయాలను స్వయంగా తెప్పించుకున్న ఎమ్మెల్యే ఆ వైపుగా అభివృద్ధి చేయడానికి ముందుకు వెళ్తున్నామన్నారు.
రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాల మౌలిక వ సతుల అభివృద్ధిలో రాజీ పడే ప్రసక్తి లేదన్నా ఆయన ఇప్పటికే మర్రిగూడెం కస్తూరిబాలో 1 కోటి 25 లక్షల రూపాయల సొంత నిధులతో 9 అదనపు తరగతి గదులు, 30 కి పైగా బాత్రూంలు, టాయిలెట్స్ నిర్మాణం తో పాటు సరిపడా ఆట స్థలాన్ని కూడా తయారు చేసి ఇస్తున్నామని గుర్తు చేశారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలలు వసతి గృహాలలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడానికి సాయ శక్తుల కృషి చేస్తున్నామన్నారు.
ఎమ్మెల్యే వెంట స్థానిక నాయకులతోపాటు కస్తూర్బా సిబ్బంది, సంబంధిత శాఖ ఇంజనీర్ లు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
09 Sep 2025 15:22:07
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లోకల్ గైడ్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలో ఉన్న కొత్తగట్ల గ్రామంలో డేరా గుడిసెలో నివసిస్తున్న మడకం పుల్లయ్య...