విద్యుత్ అమరవీరుల పోరాట స్ఫూర్తితోనే  రాష్ట్రంలో ఉచిత  విద్యుత్

విద్యుత్ అమరవీరుల పోరాట స్ఫూర్తితోనే  రాష్ట్రంలో ఉచిత  విద్యుత్

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్); నాటి విద్యుత్ ఉద్యమ పోరాట స్ఫూర్తితోనే  రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అమలవుతుందని  సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి అన్నారు. గురువారం స్థానిక సిపిఐ కార్యాలయం మగ్దూమ్ లో బషీర్ బాగ్ విద్యుత్ పోరాటం లో అమరవీరులైన రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా  వీరస్వామి మాట్లాడుతూ గత 25 సంవత్సరాల క్రితం చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పెంచిన  విద్యుత్ చార్జీలను  ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ  రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరిగిందని, అన్ని రాజకీయ పార్టీలు చలో హైదరాబాద్ పిలుపునిస్తే ర్యాలీకి అప్పటి రాష్ట్ర కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి నాయకత్వం వహించారని గుర్తు చేశారు. చలో హైదరాబాద్ ర్యాలీపై నరహంతకుడు చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు జరిపిన లాఠీచార్జి, తుపాకుల కాలుపుతో ముగ్గురు అమరులు అయి ఎంతోమంది క్షతగాత్రులు కావడం జరిగిందని పేర్కొన్నారు.  నాటి అమరుల స్ఫూర్తితో నేడు విద్యుత్ సంస్కరణలను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తున్న  విధానాలపై సంఘటితంగా ప్రజా ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో  సిపిఐ పట్టణ కార్యదర్శి కర్ర సైది రెడ్డి, సహాయ కార్యదర్శి, వి లెనిన్, నందం, ముండ్ల ముత్యాలు, కోమటిరెడ్డి  ప్రద్యుమారెడ్డి, ఎస్ కె మదర్, యూసుఫ్, వీరయ్య,సుజాత, విజయ,ధనలక్ష్మి, సర్దార్,చంద్ నాగమ్మ,రేణుక, మణెమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

కష్టాల్లో ఉన్న వారికి అండగా ఉంటాం కష్టాల్లో ఉన్న వారికి అండగా ఉంటాం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లోకల్ గైడ్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలో ఉన్న కొత్తగట్ల గ్రామంలో డేరా గుడిసెలో నివసిస్తున్న మడకం పుల్లయ్య...
పాలేరు నియోజకవర్గ చిన్నారులకు పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత షూస్ పంపిణీ
ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా
జెడ్పిటీసి, ఎంపీటీసి స్థానాలకు ఈ నెల 10న ఓటర్ తుది జాబితా విడుదల  
విద్యార్థులకు మార్గదర్శకులు గురువులే - జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్.
తుర్క ఎనికే పల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయండి.
నవభారత నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం..