పెండింగ్ స్కాలర్షిప్స్,
ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్); పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ 7500 కోట్ల బకాయిలు , ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ హాస్టల్లో మెస్ ఛార్జీలు వెంటనే విడుదల చేయాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల అశోక్ కుమార్ డిమాండ్ చేశారు.
సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా నల్లగొండ జిల్లా కలెక్టర్ కి ,
ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు . ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల కాక ఎంతోమంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కావడం జరుగుతుంది అన్నారు. ప్రైవేట్ కళాశాలలు, పిసిరియంబర్స్మెంట్ రాలేదు కావున మీరు డబ్బులు కట్టి సర్టిఫికెట్స్ తీర్చిక వెళ్ళండి అని విద్యార్థులను కళాశాల యజమాన్యాలు తీవ్ర మానసిక ఇబ్బందుల గురి చేస్తుంటే పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కావడం జరుగుతుంది అన్నారు కావున వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసి మిస్ చార్జీలు కూడా విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంపెల్లి బిక్షపతి గౌరవ సలహాదారులు కందుల విజయ్ కుమార్ గారు
సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్
జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న జిల్లా ఉపాధ్యక్షులు కాసర్ల లింగస్వామి రాష్ట్ర కార్యదర్శి కామల్ల నరేష్ బాకీ తరుణ్ స్టీరింగ్ కమిటీ సభ్యులు జాన్సన్ జిల్లా కో కన్వీనర్ వినోద్ చారి మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి ఈరిగ్ బిక్షం శివ తేజ అ తదితరులు పాల్గొన్నారు .