ఆసుపత్రి ఖర్చు నిమిత్తం రూ 10,000 ఆర్థిక సహాయం అందజేసిన పిట్టల నాగరాజు
By Ram Reddy
On
మల్కాజిగిరి లోకల్ గైడ్:
వినాయక నగర్ 137 డివిజన్ వాజ్ పేయి నగర్ లో నివాసం ఉంటున్న జ్యోతి అనే నిరుపేద వృద్దురాలికి రెండు కిడ్నీలు పాడై డయాలిసిస్ కొరకై ఆసుపత్రి ఖర్చు నిమిత్తం కాంగ్రెస్ నాయకుడుపిట్టల నాగరాజు రూ 10,000
ఆర్థిక సహాయం అందజేశారు. మంగళవారం మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేతుల మీదుగా రూ 10000/- రూపాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిట్టల నాగరాజు మాట్లా డుతూ..అందరూ బాగుం డాలి, అందులో నేను ఉండాలన్నారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై ప్రత్యేక్షంగా పోరాడే అవకాశాన్ని ప్రజలు కల్పిస్తారని ఆశించారు. అలాగే మైనంపల్లి హన్మంతన్న స్ఫూర్తితో మానవ సేవే మాధవ సేవ అంటూ నేను చేసే ప్రతి సేవ ఆ వెంకటేశ్వర స్వామే నా చేత చేయిస్తున్నాడని నమ్ముతూ ముందుకు వెళతానని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని విజయ వంతానకి పీఎన్ ఆర్ గ్రూప్ సభ్యుల సహకారం ఉండడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్ , సీనియర్ కాంగ్రెస్ లీడర్లు, పీఎన్ ఆర్ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.
Tags:
About The Author

Latest News
13 Aug 2025 11:09:47
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాల గ్రంథాలయం లో ఘనంగా జాతీయ గ్రంథ పాలకుల దినోత్సవాన్ని నిర్వహించారు. భారతదేశంలో 'గ్రంథాలయ శాస్త్ర పితామహుడు' అని పిలువబడే...