విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి..!!
జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ పి. విజేందర్ రెడ్డి.
లోకల్ గైడ్: మహబూబాబాద్ జిల్లా :విద్యుత్ వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి కృషిచేయనున్నట్లు మహబూబాబాద్ జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ పి. విజేందర్ రెడ్డి అన్నారు.సోమవారం నెల్లికుదురు మండలంలోని మునగలవీడు సెక్షన్ పరిధిలోని ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ లో నూతనంగా నిర్మించి సెక్షన్ కార్యాలయాన్ని మహబూబాబాద్ సూపరింటెండింగ్ ఇంజనీర్ పి. విజేందర్ రెడ్డి ప్రారంబించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, విద్యుత్ వినియోగదారులందరికి అసిస్టెంట్ ఇంజనీర్ ఈ కార్యాలయం లో అందుబాటులో ఉంటారని తమ సమస్యలను సత్వరమే పరిష్కరించ డానికి స్టాఫ్ అందరూ ఈ ఆఫీస్ లో అందుబాటులో ఉంటూ విద్యుత్ సేవలు అందించడం జరుగు తుందన్నారు.ఇంత క్రితం నెల్లికుదురు ఆఫీస్ ప్రక్కనే మునగలవీడు ఆఫీస్ ఉండేదిని. ఇప్పుడు ఆసమస్యలేదని మునగలవీడు సబ్ స్టేషన్ ప్రక్కనే ఈ కొత్త ఆఫీస్ వినియోగదారులకు అందుబాటులో ఉండాలని నిర్మించడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సూపరింటెండింగ్.ఇందులో భాగంగా విద్యుత్ భద్రత సూచనలను తెలియజేస్తూ స్టాఫ్ కు ఇన్డక్షన్ టెస్టర్ లను ఎస్ఇ చేతుల మీద అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజనల్ ఇంజనీర్ తొర్రూరు,బి. రవి, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ తొర్రూరు చలపతిరావు, మునిగల వీడు అసిస్టెంట్ ఇంజనీర్,భార్గవి, లైన్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్, హెల్పర్ శేఖర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
About The Author
