సిపిఎస్ రద్దు పి ఆర్ టి యు తెలంగాణ ధ్యేయం: హర్షవర్ధన్ రెడ్డి. 

రాష్ట్రంలోనీఉద్యోగ, ఉపాధ్యాయులకు వెన్నుపోటు

సిపిఎస్ రద్దు పి ఆర్ టి యు తెలంగాణ ధ్యేయం: హర్షవర్ధన్ రెడ్డి. 

నిర్మల్ : లోకల్ గైడ్ :
తెలంగాణ రాష్ట్రంలోనీఉద్యోగ, ఉపాధ్యాయులకు వెన్నుపోటు పొడిచి నాటి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు తీసుకువచ్చిన సిపిఎస్ విధానం రద్దు చేయించడమే ధ్యేయంగా పి ఆర్ టి యు తెలంగాణ ఉపాధ్యాయ సంఘం పని చేస్తున్నదని ,సాధించి తీరుతామన్న విశ్వాసాన్ని సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు గాలి రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి వ్యక్తపరిచారు. 
ఆదివారం హైదరాబాదులోని ఇందిరాపార్క్ నందు పి ఆర్ టి యు తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించబడిన వివరణ దీక్షను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన సమరములు రాజకీయ నాయకునిగా పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు రాష్ట్రం సాధించుకున్న తర్వాత సిపిఎస్ విధానాన్ని రద్దుపరిచి ఓ పి ఎస్ విధానాన్ని అమలుపరచడం జరుగుతోందని ఉద్యోగులకు భరోసా కల్పించడం జరిగిందన్నారు. అనంతరం 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగి ముఖ్యమంత్రిగా పదవీ చేపట్టగానే మాట మార్చి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ద్రోహం   తల పెట్టారని విమర్శించారు. నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలోనీ ప్రభుత్వ ఉద్యోగులకు అమలు పరచబోయే పింఛన్ విధానాన్ని కేంద్రంలోని 
 పీఎఫ్ఆర్డిఏ అడగడం జరిగిందన్నారు. సమాధానంగా 2014 ఆగస్టు 23వ తేదీన సిపిఎస్ విధానాన్ని ఎన్నుకొని నాటి ముఖ్యమంత్రి జారీ చేసిన  జీవో 28 రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయుల జీవితాలను అంధకారంలోనికి నెట్టి వేయడం జరిగిందని ఆవేదన వ్యక్తపరిచారు. తెలంగాణ లో నిజమైన విద్రోహ దినం జూన్ 28  అన్నారు. సిపిఎస్ విధానానికి వ్యతిరేకంగా గళం ఎత్తి 2017 ఆగస్టు 23న ఇందిరా పార్కు నందు పిఆర్టియు తెలంగాణ ఆధ్వర్యంలో నిరసన సభను నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు. సిపిఎస్ రద్దు అంశం 2018, 2023 కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిందన్నారు. నాటి పిసిసి అధ్యక్షుడు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర సందర్భంగా సిపిఎస్ రద్దును సమర్థించడం జరిగిందన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ సిపిఎస్ రద్దుకు వాగ్దానం చేసి అమలు పరచడం జరిగిందన్నారు.  సిపిఎస్ రద్దు పరచడం వల్ల తెలంగాణ రాష్ట్రంలోని 2 లక్షల 70 వేల ఉద్యోగ, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుందన్నారు. సిపిఎస్ ఉద్యోగుల ఖాతాల్లో పది శాతం రాష్ట్ర ప్రభుత్వవాటాగా317 కోట్లు ప్రతినెల జమ చేయడం జరుగుతుందన్నారు. సిపిఎస్ విధానం రద్దు పరిస్థితి ప్రతి ఏటా సుమారు 4000 కోట్ల ప్రజాధనం మిగులుతుందన్నారు. పి ఆర్ టి యు తెలంగాణ సంఘం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి సిపిఎస్ రద్దు అంశంతో పాటు 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలుపరచుటకు ముఖ్యమంత్రినీ ఒప్పిస్తామన్న విశ్వాసాన్ని  ఆయన వ్యక్తపరిచారు.  దీక్ష శిబిరంలో రాష్ట్ర అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు చెన్నయ్య, రత్నాకర్ రావులు రాష్ట్రంలోని 33 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News