వరుస బైక్ దొంగతనాలను చేదించిన చందానగర్ పోలీసులు

అభినందించిన..ఏసిపి శ్రీనివాస్ కుమార్

వరుస బైక్ దొంగతనాలను చేదించిన చందానగర్ పోలీసులు

శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి):

చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న వరుస బైక్ దొంగతనాలను చందానగర్ పోలీస్ స్టేషన్ నేర పరిశోధన సిబ్బంది చేదించారు. చంద్రయన్ గుట్టకు చెందిన పాత నేరస్థుడు షేక్ అబ్దుల్ నయీమ్ ను సి‌సి కెమెరాలు, ఆధారాల సహాయంతో పట్టుకున్నారు. విచారణలో అతను రెండు మోటార్ సైకిళ్లు (ఫాషన్ ప్రొ, హీరో గ్లామర్),  ఒక ట్రాలి ఆటో దొంగిలించి నట్లు ఒప్పుకున్నాడు.
నిందితుడు గతంలోనూ శంషాబాద్, చంద్రయాన్ గుట్ట, శాలిబండ, షాహినాయత్ గంజ్, బాలాపూర్ పోలీస్ స్టేషన్ ల పరిధిలో దొంగతన కేసులలో రిమాండు అయినట్లు తెలుసుకున్నారు. 
నిందితుడిని ఆగస్టు 28న అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఈ కేసులో సిసి కెమెరాలను పరిశీలించిన డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్ ఎన్. భాస్కర్ ఆధ్వర్యంలో ఎస్ఐ నరసింహారెడ్డి, బుచ్చిరెడ్డి, ప్రభాకర్, విఠలయ్య లతో కలిసి నిందితుడిని పట్టుకున్నారు.

Tags:

About The Author

Latest News

అర్హులైన పేదలందరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం-రాష్ట్ర రెవిన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి   అర్హులైన పేదలందరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం-రాష్ట్ర రెవిన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  
రంగారెడ్డి    లోకల్ గైడ్ :    రానున్ను రోజుల్లో మూడు విడతల్లో అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల...
వెళ్లి రావయ్యా గణపయ్య,కోట్లాది భక్తుల పూజలు ఘనంగా జరిగాయి
పట్టణాలలో పాలన సమర్థవంతంగా జరగాలి.....జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
జి యస్ టీ తగ్గింపుపై సంతోషం వ్యక్తం చేసినవివిధ రంగాల వ్యాపారస్తులు
గ్రామ పాలన అధికారులు పనిపై పూర్తి శ్రద్ధ వహించి విధులు నిర్వర్తించాలి.
సొల్లు మాట్లాడే వారికి ఇది గుణపాఠం 
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెరిగిన హమాలి రేట్లు.