శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న మంత్రి జూపల్లి
నాగర్ కర్నూల్ జిల్లా(లోకల్ గైడ్); శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దర్శించుకున్నారు. అర్చకులు, అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీశైల మల్లన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద ఆశీర్వచనం ఇచ్చి, స్వామివారి తీర్ధప్రసాదాలు అందజేశారు. తాండ్ర పాపారాయ వెలమ చౌల్ట్రీని ప్రారంభించిన మంత్రి జూపల్లి శ్రీశైల క్షేత్రంలోని "తాండ్ర పాపారాయ వెలమ చౌల్ట్రీ" ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన కుర్మయ్యగారి శాంతమ్మ-నారాయణ రావు భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ... రాజకీయాలు, పదవులు శాశ్వతం కాదని, ఎవరు ఎక్కడ ఉన్నా... సమాజహితం కోసం పాటుపడాలని అన్నారు. కార్యవర్గ సభ్యులు ఒక కుటుంబంగా శ్రీశైలంలో వసతి గృహం నిర్మించుకోవడం సంతోషకరం, అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన పులువురు ప్రజాప్రతినిధులు , ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ ప్రెసిడెంట్ క్రిష్ణమనేని పాపారావు, వైస్ ప్రెసిడెంట్ తాండ్ర శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
About The Author
