ఘనంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జన్మదిన వేడుకలు
ఆశీర్వదించిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, అభిమానులు
By Ram Reddy
On
శేరిలింగంపల్లి, లోకల్ గైడ్ : శేరిలింగంపల్లి డివిజన్ లో గల హుడా ట్రేడ్ సెంటర్ లోని రామాలయంలో జన్మదిన సందర్భంగా వేద పండితులచే ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి భగవంతుని ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం తారానగర్ లోని శ్రీశ్రీశ్రీ తుల్జ భవాని అమ్మవారి ఆశీస్సులను అందుకున్నారు.
రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్, రాగం అభిషేక్ యాదవ్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జన్మదిన సందర్భంగా వృద్ధులకు, పేద వారికీ ఆహారదాన కార్యక్రమం చేపట్టారు. శేరిలింగంపల్లి డివిజన్ ప్రధాన కార్యదర్శి చింతకింది రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి ఆటో యూనియన్ మెంబర్స్ కి ఆప్రన్ లను కార్పొరేటర్ చేతుల మీదుగా పంపిణి చేశారు. క్రేన్ తో భారీ ఎత్తున గజమాల వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్ కార్యకర్తలు.
ఎస్ఎల్ విడిసి ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్ విలేజ్ కమిటీ సమక్షంలో శాలువాలతో సత్కరించి, గజమాల వేసి కార్పొరేటర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
గచ్చిబౌలి విలేజ్ ప్రెసిడెంట్ సయ్యద్ నయీమ్, గఫ్ఫర్, శ్రీకాంత్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు, అభిమానుల సమక్షంలో వార్డు పార్క్ చౌరస్తా నుండి మొదలుకుని క్రేన్ తో "భారీ గజమాల" వేసి జన్మదిన సందర్భంగా అలంకరించిన వర్టెక్స్ కింగ్ స్టన్ పార్క్ విల్లాస్ క్లబ్ హౌస్ వరకు భారీ ఎత్తున ర్యాలీగా తరలివచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
శేరిలింగంపల్లిలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జన్మదిన సందర్భంగా నేతలు హంగామా చేశారు. డిజె సౌండ్స్, బ్యాండ్ మేళాల నడుమ రోడ్లపై డ్యాన్సులు చేశారు. తమ అభిమాన నాయకుడి పుట్టిన రోజు సందర్భంగా ప్రధాన కూడళ్లలో భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. వేదికపై చేరుకున్న రాగం నాగేందర్ యాదవ్ ని పలువురు సన్మానించారు. స్థానిక ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ, పఠాన్ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, తదితర డివిజన్ ల కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, పురప్రముఖులు, శేరిలింగంపల్లి నియజకవర్గం, రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసి కార్పొరేటర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మధ్యాహ్న విందులో రాష్ట్ర నలుమూలల నుండి హాజరైన ప్రతిఒక్కరూ భోజనం స్వీకరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ..నా జన్మదినం సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు, అభిమానులు మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో భవిష్యత్తులో ఉన్నతమైన పదవులను అధిరోహించాలని ప్రతి ఒక్కరూ మనసారా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author

Latest News
11 Aug 2025 20:18:07
మహబూబాబాద్ జిల్లా లోకల్ గైడ్ : మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళి నాయక్ ముఖ్య అతిదిగా సోమవారం దామరవంచ ట్రైబల్ వెల్ఫేర్ బాలుర హాస్టల్‌లో జాతీయ నులిపురుగుల...