సేవా స్పూర్తికి నిదర్శనం
పెరిక విద్యార్థి వసతి గృహం ప్రధాన కార్యదర్శి అచ్చా రఘు కుమార్
By Ram Reddy
On
కోకపేట పెరిక భవనం నిర్మాణానికి అచ్చా రఘు కుమార్ విశిష్ట సహాయం ఐదు లక్షల విరాళం ప్రకటన.
జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 09(లోకల్ గైడ్ న్యూస్):
భవనం నిర్మాణం కోసం ఆయన ప్రకటించిన ఐదు లక్షల రూపాయల ప్రకటన కులం పట్ల ఉన్న బాధ్యతాభావానికి నిదర్శనం అన్నారు.
అందులో గతంలో రెండు లక్షల రూపాయల అందజేయగా మరో లక్ష రూపాయలు అందజేసి తమ ఉదార సేవాస్ఫూర్తిని మరింత బలంగా చాటిచెప్పారు.
లక్ష రూపాయల చెక్కును భవన నిర్మాణ కమిటీ చైర్మన్ సుందరి వీరభాస్కర్ కు అందజేశారు.
అచ్చా రఘు కుమార్ కి రాష్ట్ర సంఘం అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్, గౌరవ అధ్యక్షుడు మద్దాలింగయ్య, రాష్ట్ర ముఖ్య సలహాదారు శ్రీ రామ్ భద్రయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొంగరి మనోహర్, పెరిక విద్యార్థి వసతి గృహ అధ్యక్షుడు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, మాజీ రాష్ట్ర సంఘం అధ్యక్షులు పాయిలి జంగయ్య, శ్రీరామ్ దయానంద్, దాసరి మల్లేశం, విద్యార్థి వసతి గృహం ప్రధాన కార్యదర్శి అచ్చా రఘుకుమార్, రాష్ట్ర సంఘ అధికార ప్రతినిధి దొంగరి శంకర్, వసతి గృహం కార్యనిర్వాహక కార్యదర్శి అంకతి విజయ్ కుమార్,వసతి గృహం కోశాధికారి రవికుమార్, ఎల్బీనగర్ కోశాధికారి బల్తీ రజినీకాంత్ పాల్గొని కృతజ్ఞతలు తెలిపారు.కుల సమాజ అభ్యున్నతికి అంకితమైన ఇటువంటి సేవా హృదయాలు మన పెరిక ఐక్యతకు అసలైన బలస్తంభాలు అని వారు పేర్కొన్నారు.
భవిష్యత్ తరాలకు విద్య, సామాజిక చైతన్యం, సమావేశాలకు కేంద్రంగా నిలిచే కోకాపేట పెరిక భవనం నిర్మాణంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం. అచ్చా రఘు కుమార్ ఈ సేవా స్పూర్తి మరెందరికో మార్గదర్శకంగా నిలిచి, సమాజ సేవలో మరింత మంది ముందుకు రావాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నామని గటిక విజయకుమార్, మద్దా లింగయ్య తెలియజేశారు.
Tags:
About The Author
Latest News
17 Feb 2026 22:14:06
కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్.
