తొర్రూరులో వినాయకుల దర్శనం – మహిళలకు చీరల పంపిణీ.

వార్డులోని మహిళలకు చీరలు అందజేసిన ఝాన్సీ రాజేందర్ రెడ్డి వారితో ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.

తొర్రూరులో వినాయకుల దర్శనం – మహిళలకు చీరల పంపిణీ.

తొర్రూర్ లోకల్ గైడ్:

తొర్రూరు పట్టణంలోని 14వ వార్డులో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్థానికంగా ప్రతిష్టించిన పలు వినాయక విగ్రహాలను దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

అనంతరం వార్డులోని మహిళలకు చీరలు అందజేసిన ఝాన్సీ రాజేందర్ రెడ్డి వారితో ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తానని, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని ఆమె భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. పండుగ సందర్బంగా ప్రాంతమంతా ఉత్సాహభరితంగా మారింది.

Tags:

About The Author

Latest News

కష్టాల్లో ఉన్న వారికి అండగా ఉంటాం కష్టాల్లో ఉన్న వారికి అండగా ఉంటాం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లోకల్ గైడ్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలో ఉన్న కొత్తగట్ల గ్రామంలో డేరా గుడిసెలో నివసిస్తున్న మడకం పుల్లయ్య...
పాలేరు నియోజకవర్గ చిన్నారులకు పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత షూస్ పంపిణీ
ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా
జెడ్పిటీసి, ఎంపీటీసి స్థానాలకు ఈ నెల 10న ఓటర్ తుది జాబితా విడుదల  
విద్యార్థులకు మార్గదర్శకులు గురువులే - జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్.
తుర్క ఎనికే పల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయండి.
నవభారత నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం..