కష్టాల్లో ఉన్న వారికి అండగా ఉంటాం

నైనిషా ఫౌండేషన్ సెక్రటరీ సంతోష్ యాదవ్ 

కష్టాల్లో ఉన్న వారికి అండగా ఉంటాం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లోకల్ గైడ్ : 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలో ఉన్న కొత్తగట్ల గ్రామంలో డేరా గుడిసెలో నివసిస్తున్న మడకం పుల్లయ్య వృద్ధాప్యం వల్ల ఆర్థికంగా, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు. వీరు కుటుంబ పరిస్థితి తెలుసుకున్న   ఆ గ్రామ  మాజీ సర్పంచ్ మురళికి ఏదో ఒక సహాయం అందించాలనే ఉద్దేశం ఆయన హృదయంలో మెలిగింది.
వెంటనే  పుల్లయ్య కుటుంబ పరిస్థితి గురించి నైనిశా ఫౌండేషన్ సెక్రటరీ, చర్ల కంప్యూటర్, మోబైల్ రిపేర్ షాపుకు చెందిన మట్టిపల్లి సంతోష్ యాదవ్ కి తెలిపారు. సంతోష్  యాదవ్ స్పందించి తనవంతుగా తమ నైనిషా ఫౌండేషన్ బృందంతో కలిసి కొత్తగట్ల గ్రామంలో ఉన్న మడకం పుల్లయ్య కుటుంబాన్ని పరామర్శించి, 25 కేజీల బియ్యం,  నిత్యవసర సరుకులు ఇవ్వడం అందజేసారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రామస్తు నైనిషా ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగట్ల మాజీ సర్పంచ్ మురళి, నైనిశా ఫౌండేషన్ సెక్రటరీ సంతోష్ యాదవ్, రాము తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

కష్టాల్లో ఉన్న వారికి అండగా ఉంటాం కష్టాల్లో ఉన్న వారికి అండగా ఉంటాం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లోకల్ గైడ్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలో ఉన్న కొత్తగట్ల గ్రామంలో డేరా గుడిసెలో నివసిస్తున్న మడకం పుల్లయ్య...
పాలేరు నియోజకవర్గ చిన్నారులకు పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత షూస్ పంపిణీ
ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా
జెడ్పిటీసి, ఎంపీటీసి స్థానాలకు ఈ నెల 10న ఓటర్ తుది జాబితా విడుదల  
విద్యార్థులకు మార్గదర్శకులు గురువులే - జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్.
తుర్క ఎనికే పల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయండి.
నవభారత నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం..