పాలేరు నియోజకవర్గ చిన్నారులకు పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత షూస్ పంపిణీ

మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచనల మేరకు సేవా కార్యక్రమానికి శ్రీకారం

పాలేరు నియోజకవర్గ చిన్నారులకు పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత షూస్ పంపిణీ

కూసుమంచి మండలంలోని 62 పాఠశాలల్లో 1700 జతల షూస్ పంపిణీ

ఖమ్మం: లోకల్ గైడ్ :

పాలేరు నియోజకవర్గంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న చిన్నారులకు ఉచితంగా షూస్ పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచనల మేరకు పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ శ్రీకారం చుట్టింది.

మంగళవారం కూసుమంచి మండలం నరసింహులగూడెం మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మంత్రి స్వయంగా 1 నుంచి 5వ తరగతి చదువుతున్న బాలబాలికలకు షూస్ అందజేశారు. మిగిలిన ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణీ నిర్వహించారు.

కూసుమంచి మండలంలోని 62 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 1700 జతల షూస్ పంపిణీ చేశారు. కొత్త షూస్ అందుకున్న చిన్నారులు ఆనందంతో కళకళలాడారు.

ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ… “ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి  ఎల్లప్పుడూ పేదల అంటే మక్కువ చూపే  నాయకుడు. ఆయన సూచనల మేరకు పీఎస్ఆర్ ట్రస్ట్ తీసుకుంటున్న ఈ తరహా చర్యలు చిన్నారుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తాయి. ఒక చిన్న అవసరాన్ని తీర్చడం ద్వారా పిల్లల్లో చదువుపై ఆసక్తి పెంచడం మంత్రి ప్రత్యేకత”. తల్లిదండ్రులకు వ్యయ భారాన్ని తగ్గించడంలో, చిన్నారులకు సౌకర్యం కల్పించడంలో పెద్ద సహాయం. ఇలాంటి సేవా చర్యలు మరిన్ని జరగాలని ఆశిస్తున్నాం”

Tags:

About The Author

Latest News

కష్టాల్లో ఉన్న వారికి అండగా ఉంటాం కష్టాల్లో ఉన్న వారికి అండగా ఉంటాం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లోకల్ గైడ్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలో ఉన్న కొత్తగట్ల గ్రామంలో డేరా గుడిసెలో నివసిస్తున్న మడకం పుల్లయ్య...
పాలేరు నియోజకవర్గ చిన్నారులకు పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత షూస్ పంపిణీ
ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా
జెడ్పిటీసి, ఎంపీటీసి స్థానాలకు ఈ నెల 10న ఓటర్ తుది జాబితా విడుదల  
విద్యార్థులకు మార్గదర్శకులు గురువులే - జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్.
తుర్క ఎనికే పల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయండి.
నవభారత నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం..