రేకుల షెడ్డు కింద వ్యక్తి మృత దేహం లభ్యం...

రేకుల షెడ్డు కింద వ్యక్తి మృత దేహం లభ్యం...

మృతుడు షేక్ నబీగా గుర్తింపు..

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) డిచ్పల్లి మండలంలోని ధర్మారం బి గ్రామానికి చెందిన షేక్ నబీ అనే వ్యక్తి కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.. ఈ క్రమంలో గురువారం ఉదయం ఇంటి నుండి వెళ్లిన వ్యక్తి శుక్రవారం ఉదయం ధర్మారం బి గ్రామ శివారులోని ఓ బార్ కు సమీపంలోని రేకుల షెడ్డు కింద విగతజీవిగా లభ్యమయ్యాడు.. అయితే విషయం తెలుసుకున్న  పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతుడు ధర్మారం గ్రామానికి చెందిన షేక్ నబీగా గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.. మృతుడి తల్లి షేక్ అబేద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేపడుతున్నారు..

Tags:

About The Author

Related Posts

Latest News