చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే ఉంటాం  ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి మాజీ డిసిసి అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి

చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే ఉంటాం  ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి మాజీ డిసిసి అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి

 

నారాయణ పేట (లోకల్ గైడ్); నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం జిల్లా కేంద్రంలోని అభినందన్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ మండలాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఎమ్మెల్యేకు శాలువాలు, పూలమాలతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని మా తాత చిట్టెం నర్సిరెడ్డి, మా తండ్రి చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డి  ఆశయ సాధనలోనే నేను చివరి శ్వాస వరకు ప్రజాసేవలో ఉంటాను” అన్నారు.
గత 18 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఉపశమనం లభిస్తోందని చెప్పారు. రాబోయే మూడేళ్లలో విద్య, వైద్యం, సాగునీరు సహా అన్ని రంగాల్లో ప్రాంత అభివృద్ధి సాధిస్తామని హామీ ఇచ్చారు. మాజీ డిసిసి అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం 20 ఏళ్లుగా తనతో నడిచిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఈ జిల్లా అభివృద్ధి సాధిస్తాం. భూములు ఇచ్చిన రైతన్నలకు పాదాభివందనం చేస్తున్నాను. వారి నష్టపరిహారం పెంచే దిశగా ఇప్పటికే చర్చలు జరిగాయి” అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించగా 30 మంది యువకులు రక్తదానం చేశారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు ఎమ్మెల్యేకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు పేట మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ బండి వేణుగోపాల్, పట్టణ అధ్యక్షులు ఎండి సలీం, సీనియర్ నాయకులు కోట్ల రవీందర్ రెడ్డి, గందే చంద్రకాంత్, పిఎసిఎస్, ఫిషరీస్ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts

Latest News

నాంది పూజతో నడయాడిన శ్వేతార్కలయం నాంది పూజతో నడయాడిన శ్వేతార్కలయం
హనుమకొండ జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్): కాజీపేట స్వయంభు శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ క్షేత్రంలో 2025 గణపతి నవరాత్రి ఉత్సవ కల్యాణోత్సవ వేడుకలు నేటితో  ప్రారంభమయ్యాయి...
మా భూమిలో అక్రమ నిర్మాణాలు ఆపండి..!
ముగియనున్న శ్రావణమాసం బోనాలు
మహిళా శిశు వికాస కేంద్రం నిర్వాహకులకు కలెక్టర్ హితవు
ఉస్మాన్ సాగర్ జలాశయం 2 గేట్ల ఎత్తి నీరు విడుదల
దేశంలో సాంకేతిక రంగం అభివృద్ధికి ఆధ్యుడు  రాజీవ్ గాంధీ
పట్టణంలో పారిశుధ్య పనులు పరిశీలించిన కలెక్టర్