దేశంలో సాంకేతిక రంగం అభివృద్ధికి ఆధ్యుడు రాజీవ్ గాంధీ
కాంగ్రెస్ నేతల ఘన నివాళి
మల్కాజిగిరి (లోకల్ గైడ్); దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని
మాజీ కౌన్సిలర్ లు, కాంగ్రెస్ నాయకులు ఎస్ ఆర్ ప్రసాద్, ఇందిరా చంద్రశేఖర్ అన్నారు. బుధవారం దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 81వ జయంతి సందర్బంగా వారు, నేరేడ్ మెట్ చౌరస్తాలోని రాజీవ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పిం చారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ... రాజీవ్ గాంధీ భారత దేశ ప్రధానిగా పని చేసిన సమయంలో ప్రప్రధమంగా సాంకేతిక రంగాన్ని తీసుకుని వచ్చారని, నేడు సాఫ్ట్ వేర్ రంగం అభివృద్ధి చెందుతుం దంటే దీనికి ఆధ్యుడు రాజీవ్ గాంధీ అని తెలిపారు. ఈ సందర్భం గా పేదల సంక్షేమానికి, దేశాభివృద్ధికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను వారు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పి.చంద్రశేఖర్, పీసీసీ డెలిగేట్ ఆర్. చంద్రశే ఖర్, మాజీ కౌన్సిలర్ వెంక టేష్, గోకుల్,ప్రభ, రాఘవన్, 136 డివిజన్ ప్రెసిడెంట్ చిర్ర రాజలింగం, వర్కింగ్ ప్రెసిడెం ట్ యాది, జనరల్ సెక్రటరీ ప్రవీణ్ జాన్సన్,మహేష్ యాదవ్,శ్రీనివాస్ ముదిరాజ్ రాజు, నర్సింగరావు, రవీంద ర్, కృష్ణ, నారాయణ రెడ్డి, అజయ్, కనకరాజు, మురళీ, శంకర్ రావు, విజయలక్ష్మి, మైథిలి, సుధా, మల్లిక, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
About The Author
Related Posts
