ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంట
మిడ్జిల్ అభివృద్దే నా ధ్యేయం ఎంపీ డీకే అరుణమ్మ
మిడ్జిల్ జులై 14:(లోకల్ గైడ్):ప్రజా సమస్యల పరిష్కారంలో శక్తివంచన లేకుండా చేస్తానని సమస్యలు పరిష్కరించడంలో ముందు ఉంటానని మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యులు డీకే అరుణమ్మ అన్నారు. సోమవారం మిడ్జిల్ మండల కేంద్రంలోని ఆర్వో ప్లాంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రూ.7 లక్షల ఎంపీ నిధులతో నూతనంగా నిర్మించిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను స్థానిక పార్టీ నాయకులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.అనంతరం స్థానిక బీజేపీ నేతలతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఎంపీడీకే అరుణమ్మ మాట్లాడుతూ మిడ్జిల్ సర్వతోముఖాభివృద్దే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఆమె అన్నారు. ప్రజాసమస్యల పరిస్కారంలో శక్తివంచన లేకుండా కృషి చేస్తానని భరోసాఇచ్చారు.మిడ్జిల్ ప్రజలకు ఇచ్చిన మాట మరువభోనని ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తానని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు జనార్దన్ రెడ్డి సింగల్ విండో చైర్మన్ శ్రీనివాసరెడ్డి బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పల్లె తిరుపతి సాహితి రెడ్డి బిజెపి మండల అధ్యక్షులు నరేష్ నాయక్ మాజీ మండల అధ్యక్షులు నరేందర్ తాసిల్దార్ రాజు ఎంపీడీవో గీతాంజలి కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు చిర్రా శేఖర్ రెడ్డి జంగాయ్య తో పాటు పలు గ్రామాల భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
About The Author
Related Posts
