అప్పుడే పుట్టిన ఆడబిడ్డను అమ్మకానికి పెట్టి సభ్య సమాజం తరలించుకునేలా చేసిన తల్లిదండ్రులు...

అప్పుడే పుట్టిన ఆడబిడ్డను అమ్మకానికి పెట్టి సభ్య సమాజం తరలించుకునేలా చేసిన తల్లిదండ్రులు...

 రెండు లక్షలకు బేరాసారాలు జరిపిన స్థానికులు...

బెడిసి కొట్టడంతో బయటపడ్డ బాగోతం...

చివరికి ఐదుగురిపై కేసు నమోదు...

 నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) అప్పుడే పుట్టిన ఆడబిడ్డను అమ్మకానికి పెట్టారు కార్కటకులైన కన్న  తల్లి దండ్రులు...క్రయ విక్రయాల మధ్య ఒప్పందం లో తేడాలు రావడంతో విషయం బయటకొచ్చింది...ఈ సంఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసిన అమానుష ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి...తొమ్మిది నెలలు మోసి కన్న బిడ్డను తనివి తీరా చూసుకోకముందే కన్న తల్లి దండ్రులు మధ్యవర్తి తో రెండు లక్షల రూపాయలు విక్రయానికి పెట్టిన ఘటన నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోని ఒకటవ టౌన్ సమీపంలోనే వెలుగులోకి వచ్చింది.. వన్ టౌన్ పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ  మరియు స్థానికుల ద్వారా తెలిసిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి... నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోని మిర్చి కాంపౌండ్​ కు చెందిన ముత్యాలమ్మ, వెంకట్​రావులకు నలుగురు ఆడపిల్లల సంతానం ఉన్నారు... ఇదిలా ఉండగా జూన్​ 30న ఐదో సంతానంగా మరల ఆడపిల్లకు జన్మనించింది. దీంతో అర్థం కానీ పరిస్థితి,ఆర్థిక పరిస్థితి దృష్ట్యా శిశువును అమ్మకానికి పెట్టారు.ఈ విషయం కాస్త స్థానికులకు తెలియడంతో పసికందును విక్రయిస్తే తమకు కూడా కాస్త డబ్బు వస్తుందనే ఆశతో స్థానికులు సోలాపూర్ కు చెందిన వ్యక్తికి 2 లక్షల రూపాయలకు విక్రయించారు. అయితే ఈ విషయం కాస్త ఆ నోటా ఈ నోటా బయటకు రావడంతో ఐదు రోజుల అనంతరం ఈ విషయం బయటకు పొక్కింది. దీంతో శుక్రవారం రాత్రి స్థానిక సీడీపీవో సౌందర్య ఫిర్యాదు మేరకు పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పసికందును సోలాపూర్ తెప్పించి సంరక్షణ గృహానికి తరలించారు.. పిల్లల క్రయ విక్రయాలు ఎక్కడయినా వదిలేసిన కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు... ఇలాంటి ఘటనలు తమ దృష్టికి వస్తే డయల్ హండ్రెడ్ లేదా 1098 నంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు..

Tags:

About The Author

Related Posts

Latest News