అంతర్జాతీయ కరాటే లో షాద్నగర్ బుడోఖాన్ విద్యార్థుల ప్రతిభ
అంతర్జాతీయ స్థాయిలో మెరిసిన యాదవ్ బుడోఖాన్ కరాటే విద్యార్థులు
By Ram Reddy
On
బంగారు వెండి మరియు రజత పతకాలు సాధించిన విద్యార్థులు.కర్ణాటక షిమోగాలో రెండు రోజుల పాటు కరాటే పోటీలు యాదవ బుడోకాన్ కరాటే క్లబ్ డిప్యూటీ గ్రాండ్ మాస్టర్ సాయినాథ్ ను అభినందించిన నిర్వాహకులు
లోకల్ గైడ్ షాద్ నగర్
కర్ణాటక షిమోగో నెహ్రూ ఇండోర్ స్టేడియంలో మౌలే షోటోకాన్ కరాటే ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 6వ అంతర్జాతీయ స్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీల్లో షాద్ నగర్ కు చెందిన యాదవ్ బుడోకాన్ కరాటే క్లబ్ విద్యార్థులు పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబరిచారు. రెండు రోజులపాటు జరిగిన ఈ పోటీల్లో 7 బంగారు, 1 వెండి, 5 రజత పతకాలు సాధించారని, యాదవ్ బుడోకాన్ కరాటే క్లబ్ డిప్యూటీ గ్రాండ్ మాస్టర్ సాయినాథ్ యాదవ్ తెలిపారు. ఈ పోటీల్లో బద్రి నారాయణ, హరీష్, గోకుల్ నందన్, రిషికేష్, వియన్, వెదన్స్, దేవ్ మదేశ్, ఇమ్మానుల్, హరికృష్ణ ఉత్తమ ప్రతిభ కనబరిచి మెడల్స్ అందుకున్నారు. అంతర్జాతీయ కరాటే పోటీల్లో మెడల్స్ సాధించిన విద్యార్థులు,యాదవ బుడోకాన్ కరాటే క్లబ్ డిప్యూటీ గ్రాండ్ మాస్టర్ సాయినాథ్ ను కర్ణాటక మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈశ్వరప్ప, ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషనల్ మినిస్టర్ బంగారప్ప, ఎంపీ రాఘవేంద్ర, ఎమ్మెల్యే చిన్న బసప్ప, చీఫ్ ఇన్స్ట్రక్టర్ షోటోకాన్ వరల్డ్ కరాటే ఫౌండర్ మౌలే, సినీ నటుడు సుమన్, నిర్వాహకుడు వినోద్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ వినయ్ కుమార్ మరియు హర్షిక తదితరులు పాల్గొన్నారు.Tags:
About The Author

Latest News
12 Aug 2025 22:47:14
రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. సింగపూర్ వంటి దేశాల్లో 30 ఎకరాల్లోనే నైట్...