యువత క్రీడలోనే కాకుండా అన్ని రంగాల్లో రాణించాలి
బీజేపీ ఇంఛార్జి..రవికుమార్ యాదవ్
శేరిలింగంపల్లి, లోకల్ గైడ్ : వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు వంశీరెడ్డి ఆధ్వర్యంలో జయనగర్ కాలనీ లోని ఏఏంవై స్పోర్ట్స్ ఏరిన కాంప్లెక్స్ లో నిర్వహిస్తున్న ఎన్ వి ఆర్ బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..యువత ఆటలు ఆడటం వలన శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారని, ఆటల్లో గెలవటం కంటే గెలుపు కోసం చేసే ప్రయత్నం గొప్పదనీ, క్రీడల్లో పరాజయం ఉండచ్చు కానీ క్రీడాస్పూర్తిలో ఉండదన్నారు, యువత క్రీడలోనే కాకుండా అన్ని రంగాల్లో రాణించాలన్నారు. యువత ఈ పోటీ ప్రపంచం లో అన్ని రంగాల్లో పోటీ పడాలనీ, ఓడిపోతామని భయపడి ఆపకుండా ప్రయత్నం చేస్తూనే ఉండాలన్నారు. యువతకు ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్న వంశీరెడ్డికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్లు శ్రీహరి యాదవ్, గోపాల్ రావు, నర్సింగ్ యాదవ్, నరసింహ చారి, భాస్కర్ గౌడ్, వీరు యాదవ్ డివిజన్ ప్రధాన కార్యదర్శులు రేపన్ రాజు, వేణు నాగేందర్ రెడ్డి, లక్ష్మణ్, విష్ణు, ఆంజనేయులు యాదవ్, భాస్కర్ గౌడ్, సాయి, తదితరులు పాల్గొన్నారు.
About The Author
