పాలమూరులో ముందస్తు భద్రత తనిఖీలు
మహబూబ్ నగర్ ఎస్పీ డి.జానకి,ఆదేశాల మేరకు,వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్స్పెక్టర్ అప్పయ్య ఆధ్వర్యంలో ఆగస్టు 15స్వాతంత్ర్య దినోత్సవం,వినాయక చవితి సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రత చర్యలలో భాగంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.క్లాక్ టవర్,పుట్నాల బట్టి,రామ్ మందిర్,పాన్ చౌరస్తా,తూర్పు కమాన్,ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో గల హోటళ్లు,టీ స్టాళ్లు,పాన్ షాపులలో స్పెషల్ పార్టీ బృందాలు,డాగ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ అప్పయ్య మాట్లాడుతూ,ప్రజలు భద్రతా నియమాలను పాటించి శాంతి భద్రతలకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు15వ,తేదీన బైకులపై పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ర్యాలీ చేసిన చట్టరీత్య చర్యలు తీసుబడునని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్సైలు సీనయ్య,రషీద్,పోలీస్ సిబ్బంది,స్పెషల్ పార్టీ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.
About The Author
