బిసి రిజర్వేషన్లు అడ్డుకుంటున్న తెలంగాణ బిజెపి నాయకులు.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
బిసి రిజర్వేషన్లు అడ్డుకుంటున్న బీజేపీకి చెందిన 8మంది ఎంపీలు,ఎమ్మెల్యేలు,ఇద్దరు
మంత్రులు రాజీనామా చెయ్యాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు.సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంచిర్యాల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పలు ప్రజా సంఘాలు,నాయకులు మద్దతుగా పాల్గొన్నాయి.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి మాట్లాడుతు అనేక సంవత్సరాలుగా మేమెంతో మా వాటా అంతా కావాలని బిసిలు అనేక పోరాటాలు చేస్తు వస్తున్నారని,తమకు చట్టబద్ధంగా దక్కాల్సిన హక్కులు,రిజర్వేషన్లు అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తున్న పట్టించుకున్న ప్రభుత్వాలు లేవన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తు అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్ర గవర్నర్ కు పంపించిందని,కేంద్ర ప్రభుత్వాన్ని రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించాలని కోరినా మోడీ ప్రభుత్వం,తెలంగాణలోని ఎనిమిది మంది ఎంపిలు,ఇద్దరు కేంద్ర మంత్రులు,ఎమ్మెల్యేలు బీసీ రిజర్వేషన్ బిల్లును అమలు కాకుండా చట్టబద్ధత రాకుండా మొండి వైఖరినే అవలంబిస్తున్నారని అన్నారు.పైగా మతం రంగు పులుముతు బీసీలకు రిజర్వేషన్లు రాకుండా చేయడం కోసం కుట్రలు చేస్తు మాట్లాడుతున్నారని ఆరోపించారు.అణగారిన అట్టడుగు వర్గాలైనవారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలోనే సమాన హక్కుల కల్పించారని,వాటిని అమలు జరపడానికి బిజెపి ప్రభుత్వానికి,నాయకులకు వచ్చిన కడుపునొప్పి ఏమిటి అని ప్రశ్నించారు.బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చకుండా కాలయాపన చేయడం మానుకొని బీసీలు కోరుతున్న రిజర్వేషన్లు అమలు జరపాలని డిమాండ్ చేసారు.లేకుంటే తెలంగాణాలో బిజెపికి పుట్టగతులు లేకుండా చేస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో బిసి సంఘం నాయకులు గజెల్లి వెంకటయ్య,కనుకుంట్ల మల్లన్న,దుంపల రంజిత్ కుమార్,పాయిరాల రాములు,మేడిపల్లి రాజు,ప్రేమ్ కుమార్,దూలం శ్రీనివాస్,దాసరి రాజేశ్వరి,రత్నవేని,కాసిపేట రాజేశం,రామ్ చందర్,వెంకన్న,నిర్మల,పెద్ద లచ్చన్న,చందర్,రాజేందర్,సుధాకర్,చంద్ర శేఖర్,బైరి రమేష్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
Related Posts
