ప్రమాదంలో చిక్కుకున్న విద్యార్థులు – 25 మంది విద్యార్థుల ప్రాణాలు ప్రమాదంలో నుండి బయటపడిన సంఘటన

ప్రమాదంలో చిక్కుకున్న విద్యార్థులు – 25 మంది విద్యార్థుల ప్రాణాలు ప్రమాదంలో నుండి బయటపడిన సంఘటన

ప్రమాదంలో చిక్కుకున్న విద్యార్థులు – 25 మంది విద్యార్థుల ప్రాణాలు ప్రమాదంలో నుండి బయటపడిన సంఘటన

 లోకల్ గైడ్  విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా మదురవాడలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల ప్రాణాలు ముప్పులో పడిన ఘటన కలకలం రేపింది. జీఏంసీ వద్ద నుంచి విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్లేందుకు నిత్యం ప్రయాణించే ఓ స్కూల్ ఆటో రవాణా నిబంధనలకు వ్యతిరేకంగా ఎక్కువ మంది విద్యార్థులను తీసుకెళ్తూ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మొత్తం 25 మంది విద్యార్థుల ప్రాణాలు ప్రమాదంలో నుండి బయటపడ్డాయి.

ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో విద్యార్థులతో పాటు సరస్వతీ మోడల్ పాఠశాల టీచర్ మహేశ్ కూడా ఉన్నారు. మదురవాడలో టౌన్ స్టేషన్ సమీపంలో ఆటో ఒక్కసారిగా నిలిచిపోవడం వల్ల వెనుక నుంచి వచ్చిన బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థులకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం.

సంఘటనపై సమాచారాన్ని అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని విద్యార్థులను క్షేమంగా బయటపర్చారు. ఆటోలో సాధారణంగా 8 మందికి మాత్రమే అనుమతి ఉన్నా, డ్రైవర్ అత్యధికంగా 25 మందిని ఎక్కించడంతో ప్రమాదం మరింత పెరిగింది. ఇది పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యానికి నిదర్శనం అని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

విద్యార్థుల తల్లిదండ్రులు ఆటో డ్రైవర్ మరియు పాఠశాల యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతికి మించిన విద్యార్థులను ఆటోలో ఎక్కించడమే కాకుండా, భద్రతా నియమాలను పట్టించుకోకపోవడం వల్ల తమ పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని ఆరోపించారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:

About The Author

Related Posts

Latest News

మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
కావడిగుండ్ల లో సంక్రాంతి సందడి
ఏసిరెడ్డి జనార్దన్ మరణం చాలా బాధాకరం
శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
ఆల్ ఇండియా బి బి జే వి సి బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.
హౌసింగ్ బోర్డు విద్యానగర్‌లో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు
స్నేహం ఐక్యతను పెంపొందించాలి