ప్రజావాణి సమస్యలను వెంటనే పరిష్కరించాలి. అదనపు కలెక్టర్
By Ram Reddy
On
నారాయణపేట మార్చి 2:
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదు లను సత్వరమే పరిష్కరించా లనీ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణింధర్ రెడ్డి,అధికారులకు సూచిం చారు. ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 21 ఫిర్యాదు లు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను విన్నవి స్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వర మే పరిష్కరించాలని అధికా రులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీను వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:5.ఫిర్యాదులు స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్
----------------------------
Tags:
