శానిటైజర్ వర్కర్ల మీద సూపర్వైజర్ అంటూ దౌర్జన్యం చేస్తున్న స్వర్ణలత.

 హాస్పటల్ సూపర్డెంట్ కు ఫిర్యాదు చేసిన పట్టించుకోని వైనం.

శానిటైజర్ వర్కర్ల మీద సూపర్వైజర్ అంటూ దౌర్జన్యం చేస్తున్న స్వర్ణలత.

చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ కు మెమరాండం.

 మిర్యాలగూడ మార్చి 2 
 (లోకల్ గైడ్ తెలంగాణ )

భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో శానిటైజర్ వర్కర్స్ గా గత 30 సంవత్సరాల నుండి ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ లు వెయ్యి రూపాయల నుండి జీతం తీసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు వారు ఇప్పటికీ కనీస వేతనం లేకున్నా రోజుకు 300 రూపాయలు కూలి పడిన హాస్పిటల్లో పనిచేస్తూ శానిటేషన్ సెక్యూరిటీ పేషంట్ కేర్ లో పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు కనీసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కులాలను చూడకుండా గత రెండు నెలల నుండి నర్సుగా పనిచేయవలసినటువంటి స్వర్ణలత శాని టీజర్ వర్కర్ల మీద సూపర్వైజర్ అంటూ వర్కర్లను బాగా ఇబ్బందులకు గురిచేస్తుంది ఇట్టి విషయాన్ని సూపర్డెంట్  దృష్టికి తీసుకుని పోయినారు సూపర్డెంట్  కూడా స్వర్ణలత చెప్పింది వినాలని ఇష్టముంటే పని చేయండి లేకపోతే పొండి అని ఇబ్బందులకు గురి చేస్తున్నారు నర్సుగా పనిచేయాల్సినటువంటి స్వర్ణలత నేను డిసిహెచ్ బంధువుని నన్ను ఎవరు ఏమి చేయలేరు మీ ఇష్టం ఉంటే పని చేయండి లేకుంటే ఎల్లిపోరి అని ఆమె నోటికి ఎంత మాట వస్తే అంత బూతులు తిడుతున్న వారన్నారు కనీసం పనిచేసే వర్కర్లకు వయసు కూడా మర్యాద స్వర్ణ వ్రత గారు ఇవ్వట్లేదని అంతేకాకుండా పనిచేసే వర్కర్ల దగ్గరికి పోయి వారి దగ్గర చీపిరి తో ఊడుస్తున్న వారి చేతిలో ఏమి ఉన్నా కాలుతో తన్నుతున్నది వారన్నారు ఆఫ్.వారి సెలవులు తీసుకోవాలని ఆమెని అడిగితే నా ఇష్టం వచ్చినప్పుడు నేను ఇస్తాను కానీ మీరు అనుకున్నప్పుడు నేను సెలవులు ఇవ్వను అని బెదిరిస్తున్నది వారన్నారు నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ ఆధార్ కార్డు తీసుకుని రండి మీకు వయసు ఎక్కువ ఉన్నదా లేదా అని వర్కర్లను భయభ్రాంతులకు గురిచేస్తుంది మీకు వయసు ఎక్కువ ఉంటే మిమ్మల్ని అందరిని తీసేస్తానని బెదిరిస్తున్నది ఈ విషయాన్ని వర్కర్లు చెప్పుకోలేక మానసిక శోభ అనుభవిస్తున్నారని స్వర్ణలత నర్సు పేషెంట్ల కు ట్రీట్మెంట్  వదిలిపెట్టి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్ మీద అడ్మిషన్ చేస్తూ అందరిని ఇక్కడి నుండి పంపించాలని ఆమె ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి ఇప్పటికే సూపర్వైజర్ గా పని చేసిన నాగయ్య ఆమె టార్చర్ తట్టుకోలేక అందులోనుండి వెళ్లిపోయినాడు అని వారన్నారు చాలా జూనియర్ గా ఉన్న నాగరాజును ఆమె కింద పనికి పెట్టుకుని ఆయన చెప్పిన మాయ మాటలు విని మిగతా వారిని కూడా అదే విధంగా పంపించాలని స్వర్ణలత నర్సు ప్రయత్నం కొనసాగిస్తుంది ఇట్టి విషయాన్ని వైద్య విధాన పరిషత్ కోటి హైదరాబాద్ వారు మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి వచ్చి పూర్తిస్థాయిలో పరిశీలన చేసి అందులో పని చేస్తున్న ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్ కాపాడాలని వారన్నారు సబ్ కలెక్టర్ కి మెమోరండం ఇచ్చిన వారిలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి అంజన్న పెళ్లి రామలింగం మండల సమితి సభ్యులు గోగుల యాదగిరి, ఎస్కే షమీం, సాలె, జగన్, ఎస్కే రహీం,తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News