ఘోర రోడ్డు ప్రమాదం.
ఆర్టీసీ బస్సు, కారు డి . పెద్దేముల్ మండలంలో ఘటన.
ప్రమాదంలో కార్ డ్రైవర్ కు తీవ్ర గాయాలు, నుజ్జునుజైన కారు.
లోకల్ గైడ్/ తాండూర్:
ఆర్టీసీ బస్సు, కారు ఢీకొనీ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించిన ఘటన ఘటన పెద్దేముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై ప్రశాంత్ వర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం... ఇంగోలేకర్ నర్సింగ్ రావు (57) తాండూర్ డిపోలో 30 సంవత్సరాల నుంచి ఆర్టీసి డ్రైవర్ గా పనిచేస్తూ పట్టణంలోని గాంధీ నగర్ లో నివాసం ఉంటున్నాడు.సోమవారం ఉదయం 10.45 గంటలకు తాండూర్ నుండి మెహిదీపట్నం వెళ్తున్న క్రమంలో మన్సాన్పల్లి శివారులో.. వికారాబాద్ నుండి వేగంగా వస్తున్న కారు ఆర్టీసీ బస్సును(టీజీ 34 జెడ్0074)ను ఢీకొంది. ప్రమాదంలో బస్సు కుడి భాగం, ముందు వైపు దెబ్బతింది.అదేవిధంగా కారు డ్రైవర్ అయినటువంటి ఎండి అయాజ్ కుడి కాలు, కుడి భుజంకు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజైనట్లు తెలిపారు.ఈ నేపథ్యంలో బాధితుడు ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.
