హోలీ పండుగను సంప్రదాయ పద్ధతుల్లో ప్రశాంతంగా జరు పుకోవాలి
జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్
By Ram Reddy
On
నారాయణపేట మార్చి 2:
హోలీ పండుగతో పాటు రంజాన్ మాసం కూడా కొనసాగుతున్నందున మతసామరస్యాన్ని కాపాడుతూ పరస్పర గౌరవంతో పండుగలు నిర్వహించుకోవాలని తెలిపారు. మత పెద్దలతో సమన్వయం చేసుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బం దులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.ముఖ్యంగా యువత మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని హెచ్చరిం చారు. అతివేగం, రష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ వంటి చర్యలను పూర్తిగా నివారించాలని సూచించారు. ప్రధాన చౌరస్తాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వ హించడంతో పాటు ముఖ్య ప్రదేశాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి నిరంతర పెట్రోలింగ్నిర్వహించనున్నట్లు తెలిపారు.ఇష్టం లేని వ్యక్తుల పై, వాహనాలపై లేదా బహి రంగ ప్రదేశాల్లో బలవంతంగా రంగులు, రంగు నీళ్లు చల్లకూ డదని స్పష్టం చేశారు. బైకు లు, కార్లలో గుంపులుగా తిరిగి శాంతి భద్రతలకు భంగం కలిగించవద్దని హెచ్చరించారు.హోలీ అనంతరం చెరువులు, కుంటలు, లోతట్టు ప్రాంతాల్లో స్నానాలు చేసే సమయంలో యువత తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే అక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేయా లని అధికారులకు సూచించి నట్లు తెలిపారు. తల్లిదండ్రు లు తమ పిల్లల కార్యకలాపా లను గమనిస్తూ వారికి సరైన మార్గనిర్దేశం చేయాలని విజ్ఞప్తి చేశారు.జిల్లా ప్రజలంతా శాంతియుతంగా, భద్రంగా హోలీ పండుగను జరుపుకుని పోలీస్ శాఖకు సహకరించా లని ఎస్పీ కోరారు.
ఫోటో రైట్ అప్:6.జిల్లా ఎస్పీ వినీత్
_______________________
Tags:
