ఓడినా ప్రజాసేవలో బిజెపి నాయకుడు

ఓడినా ప్రజాసేవలో బిజెపి నాయకుడు

నారాయణపేట మార్చి 2:

నారాయణపేట పట్టణం లో ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటమి చెందినా ప్రజాసేవలో బిజెపి జిల్లా ఓబీసీ మోర్చా మాజీ అధ్యక్షుడు మిర్చి వెంకటయ్య చురుకుగా పాల్గొనడం విశేషం.మిర్చి వెంకటయ్య 8వ వార్డు నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.అయినప్పటికీ ప్రజల మధ్యేఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి నిత్యం కృషి చేస్తున్నారు.వార్డులో పారిశుద్ధ్యం,తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులను అప్రమత్తం చేసి చర్యలు తీసుకుంటున్నారు.మంచినీటి సరఫరా పైప్ లైన్ లీకేజీ కావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.దానిని గమనించి మున్సిపల్ సిబ్బందిని పిలిపించి దగ్గరుండి వెంకటయ్య మరమ్మతులు చేయించి సమస్య పరిష్కరించడంతో వార్డు ప్రజలు కృతఙ్ఞతలు తెలిపారు.
ఫోటో రైట్ అప్:4.మరమ్మతులు చేయించిన మిర్చి వెంకటయ్య 
_______________________

Tags:

About The Author

Latest News