నిజామాబాద్ అర్బన్ మహాత్మజ్యోతి బాపూలే కళాశాలను
By Ram Reddy
On
సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఉదయ భాస్కర్ రావ్...
- హాస్టల్ కలియతిరిగిన న్యాయమూర్తి....
- చట్టాలపై విద్యార్థులకు అవగాహన...
- విద్యార్థుల ఉన్నతి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచన...
- నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) విద్యార్థుల భవిష్యత్తు తప్పుదోవ పట్టకుండా చూసే బాధ్యత తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయ సిబ్బందిపై ఉంటుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఉదయ్ భాస్కర్ రావు తెలిపారు.. విద్యార్థులకు విద్యా బోధనతో పాటు మంచి నాణ్యతతో కూడిన భోజనం అందించాలని ఆయన సూచించారు.. నిజామాబాద్ అర్బన్ డిచ్ పల్లి మండలం ధర్మారం లోని కాకతీయ క్యాంపస్ అద్దె భవనంలో కొనసాగుతున్న అర్బన్ మహాత్మజ్యోతి బాపూలే కళాశాలను జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఉదయ్ భాస్కర్ రావు ఆకస్మిక తనిఖీలు చేసారు...తరగతి గదులతో పాటు భోజనశాలను పరిశీలించారు...విద్యార్థుల చదువుపై ప్రశ్నలను అడిగితెలుసుకున్నారు... కళశాలలో ఏమయినా సమస్యలు వున్నాయా అడిగి తెలుసుకున్నారు... అనంతరం విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో న్యాయ చైతన్య సదస్సులో భాగంగా చట్టాలపై అవగాహన కల్పించారు..అలాగే ర్యాగింగ్ యాక్ట్ మరియు మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే అనర్ధలు తెలియజేశారు ..అలాగే బంగారు భవిష్యత్ కు ఇంటర్మీడియట్ కీలకమైందని తెలిపారు.. ఈ వయస్సులో చెడు అలవాట్లకు బానిసై జీవితాలు పాడు చేసుకోవద్దని సూచించారు...ఒక లక్ష్యాన్ని ఎంచుకుని చదువుకోవాలని సూచించారు...ఉపాధ్యాయులు సైతం ప్రభుత్వాలు కల్పిస్తున్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పిల్లల ఉన్నతి కోసం అహర్నిశలు కృషి చెయ్యాలని సూచించారు..విద్యార్థులు కూడా ఉపాధ్యాయులు చూపిన మార్గంలో నడవాలని తెలిపారు... ఈ సందర్శనలో కార్మిక శాఖ అధికారి యోహాను, డిచ్పల్లి పంచాయితీ అధికారి జి.శ్రీనివాస్ గౌడ్, ప్రిన్సిపాల్ దివ్య రాణి తదితరులు పాల్గొన్నారు...
Tags:
About The Author
Related Posts

Latest News
11 Jul 2025 19:59:17
సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఉదయ భాస్కర్ రావ్...