"కుబేరా"లో నా పాత్రకు పలు షేడ్స్ ఉన్నాయి – నాగార్జున

ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'కుబేరా' రేపు భారీ అంచనాల మధ్య విడుదల కానుంది. చిత్రబృందం భారీగా ప్రమోషన్స్ చేస్తుండగా, నాగార్జున మీడియాతో మాట్లాడి తన పాత్ర గురించి వివరించారు.శేఖర్ కమ్ముల తనను స్క్రిప్ట్‌తో సంప్రదించినప్పుడు వెంటనే నచ్చిందని నాగార్జున చెప్పారు. తన ఇమేజ్‌కు తగినట్లు ఏ మార్పులు చేయమని కూడా చెప్పలేదని తెలిపారు. మాయాబజార్, గుండమ్మ కథ వంటి చిత్రాల్లో మార్పులు చేసినా బాగుండేవి కాదని, 'కుబేరా' కూడా అలాగే క్లాసిక్‌గా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.తన పాత్ర CBI ఆఫీసర్‌గా ఉంటుందని, అందులో పలు షేడ్స్ ఉంటాయని చెప్పారు. ‘‘ఇతర పాత్రలు బ్లాక్ లేదా వైట్ లా ఉంటే, నా పాత్రకు గ్రే షేడ్స్ ఉంటాయి’’ అన్నారు. శేఖర్ కమ్ముల తనను కొత్త అవతారంలో చూపించారని, రియలిస్టిక్ సోషల్ డ్రామా ను ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించారని నాగ్ చెప్పారు.మల్టీ-స్టారర్స్‌కి ఎప్పుడూ ఓపెన్‌గానే ఉంటానని, తన పాత్రకు బలం ఉంటే ఎప్పుడైనా చేస్తానని తెలిపారు. శేఖర్ గారి గొప్ప విజన్, బలమైన కన్విక్షన్ వల్లే ఈ సినిమా భారీగా నిర్మించబడిందని, అదే సమయంలో గ్రౌండెడ్‌గా ఉంచారని పేర్కొన్నారు. 'కుబేరా' శేఖర్ చేసిన గత సినిమాలకు భిన్నంగా ఒక కొత్త ప్రయత్నం అవుతుందని, ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:

About The Author

Related Posts

Latest News

నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన  మాజీ మంత్రి లక్ష్మారెడ్డి  నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన  మాజీ మంత్రి లక్ష్మారెడ్డి 
  మిడ్జిల్ ఆగస్టు 11:(లోకల్ గైడ్): మండల పరిధి లోని వల్లబురావు పల్లి గ్రామానికి చెందిన కృష్ణ  నూతన గృహప్రవేశ కార్యక్రమంలో సోమవారం  మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి _రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. 
స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన రాష్ట్ర ప్రభుత్వం 
నులిపురుగుల నివారణకు ప్రతి ఒక్కరు ఆల్బెండజోల్ టాబ్లెట్స్ వాడాలి
కాళేశ్వరం  ఆలయంలో అసలేం జరుగుతుంది 
వీధి కుక్కల నియంత్రణకు చర్యలేవి?