స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన రాష్ట్ర ప్రభుత్వం
_ సమస్యలతో ప్రజల అవస్థలు _ ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు విజయ్ కుమార్
లోకల్ గైడ్ నారాయణపేట ఆగస్ట్ 11: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించ కుండా నిర్వీర్యం చేసిందని దాంతో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయి ప్రజలు అవస్థలు పడుతున్నారని ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్.విజయ్ కుమార్ ఒకప్రకటనలో పేర్కొన్నా రు..ఎన్నికలు నిర్వహించక పోవడంతో గ్రామాల్లో అభి వృద్ది కుంటుపడి సమస్యలు పేరుకుపోయనీ అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడంతో ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత రావ డంతో ఎన్నికలు నిర్వహిస్తే ఒడిపోతా మన్న భయంతో బిసి రిజర్వేషన్ల సాకు తో ఎన్నికల వాయిదా వేస్తూ వస్తున్నదని అన్నారు.ఈ ప్రభుత్వానికి చిత్త శుద్ది లేదని విమర్శించారు.మొదట చేప ట్టిన గణనలో ముస్లిం మైనా ర్టీల సంఖ్య ఎలా తగ్గింద ని,క్రైస్తవులు ఎక్కడికి పోయా రని ప్రశ్నించారు. దీనిని బట్టి చూస్తే ఈ ప్రభు త్వం ఎన్నిక లకు వెళ్లేం దుకుభయప డుతున్నదని తేటతెల్లం అవుతున్నదని విమర్శించారు.ఎప్పుడు ఎన్నికలు నిర్వహించిన కాంగ్రెస్ కు పరాభవం తప్ప దని హెచ్చరిం చారు.బిజెపి గెలుపు ఖాయ మని ధీమా వ్యక్తంచేశారు.
ఫోటో రైట్ అప్:1.ఎస్సీ మో ర్చా రాష్ట్ర నాయకులు విజయ్ కుమార్
______________________
About The Author
