తిరుమలలో శ్రీవారి సన్నిధిలో కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత ఎన్.కె.లోహిత్ దర్శనం!

తిరుమలలో శ్రీవారి సన్నిధిలో కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత ఎన్.కె.లోహిత్ దర్శనం!

ప్రముఖ చలనచిత్ర నిర్మాత కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాతల్లో ఒకరైన ఎన్.కె.లోహిత్ శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమల చేరుకున్నారు. కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సినిమాలు నిర్మిస్తున్న లోహిత్, ఈ ఉదయం విఐపి బ్రేక్ సమయంలో స్వామివారి సన్నిధిలో విశేష పూజలు జరిపారు. భక్తిశ్రద్ధలతో తన మొక్కులు చెల్లించుకుని, శ్రీవారి దర్శనం పూర్తి చేసుకున్నారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదమంత్రాలతో ఆయనను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు లోహిత్‌ను పట్టు వస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బందితో పాటు లోహిత్ సన్నిహితులు కూడా పాల్గొన్నారు. స్వామివారి దర్శనం తనకు అపార ఆధ్యాత్మిక శాంతిని, ఆనందాన్ని కలిగించిందని లోహిత్ తెలిపారు. తన రాబోయే చిత్ర ప్రాజెక్టుల విజయం కోసం స్వామి ఆశీస్సులు కోరినట్లు సమాచారం. తిరుమల దర్శనం తన జీవితంలో మరపురాని క్షణంగా నిలిచిపోతుందని ఆయన భావోద్వేగంతో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన సినీ ప్రస్థానంలో శ్రీవారి కృపతో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. తిరుమలలో ఈ దర్శనం లోహిత్‌కు ఆధ్యాత్మిక, వ్యక్తిగత అనుభవంగా మిగిలిపోయింది. ప్రస్తుతం లోహిత్ దళపతి విజయ్ ఆఖరి సినిమా జన నాయగన్ సినిమాని ఎంతో నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో ఎన్నో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ మూవీతో ఎన్.కె.లోహిత్ ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి.

Tags:

About The Author

Latest News

మూడు వారాల్లో రెండు మిలియన్ల సబ్‌స్క్రైబర్లతో యూట్యూబ్ సంచలనం – IShowSpeed మూడు వారాల్లో రెండు మిలియన్ల సబ్‌స్క్రైబర్లతో యూట్యూబ్ సంచలనం – IShowSpeed
    లోకల్ గైడ్ : అమెరికాకు చెందిన యువ యూట్యూబర్ IShowSpeed అసలు పేరు డారెన్ జేసన్ వాట్కిన్స్. కేవలం మూడు వారాల్లోనే రెండు మిలియన్లకుపైగా సబ్‌స్క్రైబర్లను
నల్గొండ జిల్లా – చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, అభివృద్ధి పథం
నిజామాబాద్ జిల్లా – చరిత్ర, భౌగోళిక విశేషాలు మరియు ప్రాముఖ్యత    
ఘనంగా మాలకట్ట మైసమ్మ బోనాల పండుగ 
ఏడాది పాటు ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరం
ఆరోగ్యకరమైన పిల్లలు ఆరోగ్యకరమైన దేశం" డాక్టర్ మురళి నాయక్ శాసనసభ్యులు
విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి..!!