ఏడాది పాటు ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరం
_వికాస తరంగణి, ప్రతిమ ఫౌండేషన్, ప్రతిమ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ వారి సంయుక్త ఆధ్వర్యములో
By Ram Reddy
On
హనుమకొండ జిల్లా లోకల్ గైడ్:
79వ స్వాంతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని హన్మకొండ వికాస తరంగణి, వరంగల్ ప్రతిమ ఫౌండేషన్, ప్రతిమ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ వారి సంయుక్త ఆధ్వర్యములో త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి చేతులమీదుగా నేడు (మంగళ వారం) ప్రారంభించి, ఒక సంవత్సరం పాటు వచ్చే ఏడాది ఆగష్టు 14 వ తేది వరకు వరంగల్ ఆరెపల్లి ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నందు ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరం దిగ్విజయముగా నిర్వహిస్తామని సోమవారం ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేఖరుల సమావేశం లో వికాస తరంగణి, ప్రతిమ ఫౌండేషన్, ప్రతిమ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ బాధ్యులు డాక్టర్ బచ్చ రాధాకృష్ణ, డాక్టర్ తిప్పని అవినాష్, డాక్టర్ తుమ్మ ప్రభాకర్ రెడ్డి, దయాకర్ రెడ్డి, ఎలగందుల రాజేందర్, తిరుమల్ రావ్, మాలాని శ్రీనివాస్ లు వెళ్లడించారు.ఈ క్యాంపు నందు ఉచిత కన్సల్టేషన్, పరీక్షలు, వైద్యం అందించబడుతాయని, రొమ్ములో కాని, శరీరంలో కాని కణతులు, నోటిలో, గొంతులో ఏ పుండు అయినా, దీర్ఘకాలిక అల్సర్, కడుపునొప్పి, కామెర్లు, దమ్ము, దీర్ఘకాలిక దగ్గు, మందులకు తగ్గని తలనొప్పి, నడుమునొప్పి, మూత్రము, మలములో రక్తం పడుట ఎర్రబట్ట, తెల్లబట్ట అధికముగా అవడం, చంకలో, మెడలో గడ్డలు, థైరాయిడ్ గడ్డలు, గొంతులో మార్పు, ఎక్కడైనా గడ్డలు తగులుట, తరచు అలసట, జ్వరం రావడము మొదలగు లక్షణాలతో బాధపడుచున్నవారు ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకోగలరని వివరించారు. ఈ శిబిరానికి 35 సంవత్సరాలు దాటిన స్త్రీలు, 50 సంవత్సరాలు దాటిన పురుషులు, వంశపారంపర్యంగా క్యాన్సర్ బాధితులు, గుట్కా, పాన్, సిగరేట్, ఆల్కహాల్ వంటి అలవాట్లు కలవారు (ఏ వయస్సు వారైనా) క్యాన్సర్ స్క్రీనింగ్ అర్హతలు గా పేర్కొన్నారు.
వికాస తరంగిణి శాఖ అయిన వరంగల్ మహిళా ఆరోగ్య వికాస్ ఇంఛార్జ్ డాక్టర్ బచ్చు వీణ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి ఆదేశానుసారము మహిళల కొరకు వరంగల్ చుట్టూ ఉన్న దాదాపు 164 గ్రామాలలో క్యాంపులు నిర్వహించి 1,25,000 మంది మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించగా 8 మందిని క్యాన్సర్ తొలి దశలోనే గుర్తించి తదుపరి వరంగల్ సత్య హాస్పిటల్ నందు ఉచిత ట్రీట్మెంట్ ఇచ్చారని, ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవజీవిస్తున్నారని తెలిపారు.
ఈ క్యాంపు నందు సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ తిప్పని అవినాష్, గైనకాలజిస్ట్ డాక్టర్ తిప్పని సుమిత్ర, మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాహుల్, సహాయకులుగా నలుగురు ఇతర ఆంకాలజిస్ట్ డాక్టర్లు ఈ క్యాంపు జరిగే సంవత్సరం పాటు అందుబాటులో ఉంటారన్నారు. ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారు ఈ క్యాంపు కోసం ప్రత్యేకముగా 10 మంది ఉద్యోగులను కేటాయించారన్నారు. ఈ క్యాంపు వివరాలకు కాల్ సెంటర్ను ఏర్పాటు చేశామని, ఒక సాఫ్ట్వేర్ న్ను ప్రత్యేకించి డిజైన్ చేసామన్నారు. ప్రతిమ గ్రూప్ ఫౌండేషన్ చైర్మెన్ బోయినపల్లి శ్రీనివాస్ రావ్, డాక్టర్ హరిణి లు పూర్తి సహాయ, సహకారాలు అందించడం ఎంతో ఆనందదాయకం అన్నారు.
ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశ్యం వరంగల్ ను క్యాన్సర్ ఫ్రీజోన్ చేయాలని పైలట్ ప్రాజెక్ట్ గా గుడెప్పాడ్, ఆత్మకూర్ వికాస తరంగిణి బాధ్యులచే చుట్టు ప్రక్కల ప్రాంతాలలో అవసరమైన వారికి టెస్టుల నిమిత్తం వారి వంతు కృషి చేస్తారని తదుపరి వికాసతరంగిణి అన్ని శాఖాల ద్వారా ఈ కార్యక్రమం విస్తృత పరుస్తామన్నారు.
ఈ కార్యక్రమం లో హన్మకొండ, వరంగల్ వికాస తరంగిణి అధ్యక్షులు డాక్టర్ బచ్చు రాధాకృష్ణ, జనరల్ సెక్రటరీ పి. దయాకర్ రెడ్డి, వికాస తరంగిణి మహిళా ఆరోగ్యవికాస్ ఇంఛార్జ్ డాక్టర్ బచ్చు వీణ, ఇతరశాఖల వికాస తరంగిణి కార్యకర్తలు, వివిధ శాఖల సమన్వయకర్తలు, కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు, వాలంటీర్లు మొదలగువారు పాల్గొంటారని పేర్కొన్నారు.
కావున వరంగల్, హన్మకొండ, కాజీపేట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు, ఇతర జిల్లాల ప్రజలు కూడా ఈ ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరము నందు పాల్గొని తగు వైద్య సహాయం పొంది ఆరోగ్యకరమైన జీవనాన్ని పొందగలరని ఆశిస్తున్నాము.
Tags:
About The Author

Latest News
11 Aug 2025 21:55:43
లోకల్ గైడ్ : అమెరికాకు చెందిన యువ యూట్యూబర్ IShowSpeed అసలు పేరు డారెన్ జేసన్ వాట్కిన్స్. కేవలం మూడు వారాల్లోనే రెండు మిలియన్లకుపైగా సబ్‌స్క్రైబర్లను