భయం పుట్టిస్తున్న బంగారం ధరలు!... సామాన్య ప్రజల్లో వణుకే

భయం పుట్టిస్తున్న బంగారం ధరలు!... సామాన్య ప్రజల్లో వణుకే

లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  దేశవ్యాప్తంగా బంగారం ధరలు  విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్య ప్రజలు బంగారం  కొనడానికే వెనకడుగు వేస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఒకరోజు ధరలు తగ్గితే మరో రోజు దానికి రెండింతలు పెరిగిపోతుంది. తద్వారా ఫంక్షన్లు లేదా పెళ్లిళ్లు ఉన్న కుటుంబాలు  బంగారం ధరలను చూసి వెనకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లాంటి పలు ముఖ్య నగరాల మార్కెట్లలో  బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగిపోయాయి. ఒక విధంగా చెప్పాలంటే బంగారం ధరలను చూసి ప్రతి ఒక్కరు కూడా భయపడిపోతున్నారు. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు  ఏకంగా 1850 రూపాయలు నడుస్తోంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 2020 రూపాయలు పెరిగింది. దీంతో ప్రస్తుతం 22 క్యారెట్ల పది గ్రాములు గోల్డ్ రేటు 87450 గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 95400గా ఉంది. ఇక మరో పక్క కేజీ వెండి ధర వెయ్యి రూపాయలు పెరిగి ₹1,08,000 కు చేరుకుంది. కేవలం గత రెండు మూడు రోజుల్లోనే తులం బంగారం పై 5670 రూపాయలు, కేజీ వెండి పై 5000 రూపాయలు పెరిగింది. 

images

Tags:

About The Author

Latest News

అధ్యక్షుల వారి ఆత్మీయ ఆలింగనం అధ్యక్షుల వారి ఆత్మీయ ఆలింగనం
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంచందర్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజేసిన  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి  లోకల్ గైడ్ షాద్ నగర్...
బైపాస్ రోడ్డుకు భారీ గండి!
#Draft: Add Your Title
బాలానగర్ నాలాను పరిశీలించిన
అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల అమలు...
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు.
మలబార్ గోల్డ్ కంపెనీ ఓపెనింగ్