క్రైమ్ కేసులలో విజయం సాధించిన అధికారులకు ప్రాసిక్యూషన్ పోలీసుల సమన్వయంతో బలపడాలి

రివార్డ్ లు, నగదు ప్రధానం చేసిన సీపీ..అవినాష్ మోహంతీ

క్రైమ్ కేసులలో విజయం సాధించిన అధికారులకు  ప్రాసిక్యూషన్ పోలీసుల సమన్వయంతో బలపడాలి

సైబరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి):

సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో శనివారం “రివార్డ్ మేళా” కార్యక్రమం సీపీ కార్యాలయ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మోహంతీ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (పిపిఎస్), అదనపు పబ్లిక్ ప్రాసి క్యూటర్లు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు, లయిజన్ ఆఫీసర్లు, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో సాక్షుల విచారణ, ఆధారాల సంరక్షణ, ప్రాసిక్యూషన్‌తో సమన్వయం వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీపీ అవినాష్ మోహంతీ దోష నిరూపణలో విశేష ఫలితాలు సాధించిన 78 మంది అధికారులను ప్రశంసించి, సత్కరించారు.
వారిలో 18 పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, 18 అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు 27,  ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు 22 కోర్ట్ డ్యూటీ ఆఫీసర్లు, 11 లయిజన్ ఆఫీసర్లు ఉన్నారు. 2025 మార్చి 01 నుండి 2025 సెప్టెంబర్ 30 వరకు దోష నిరూపణ వివరాలు ఇలా ఉన్నాయి.
మొత్తం కేసులు 28, జీవిత ఖైదు11, 20 సంవత్సరాలు శిక్ష ఆరుగురికి, 10 సంవత్సరాలు శిక్ష 8, ఏడు సంవత్సరాలు శిక్ష ముగ్గురికి. ఈ సందర్భంగా సీపీ అవినాష్ మోహంతీ మాట్లాడుతూ..క్రిమినల్ కేసులలో దోష నిరూపణ సాధించడానికి నాణ్యమైన విచారణ, పటిష్టమైన ఆధారాలు, ప్రాసిక్యూషన్‌తో సమన్వయం చాలా ముఖ్యం. ముఖ్యంగా మోసం, నకిలీ పత్రాల కేసులలో దోష నిరూపణ రేటు పెంపు ద్వారా ప్రజలలో విశ్వాసం పెరుగుతుంది అని అన్నారు. అలాగే జోనల్ డీసీపీలు ప్రతి నెలా పీపీలతో సమీక్షా సమావేశాలు నిర్వహించి, పెండింగ్ ట్రయల్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, బెయిల్ రద్దు, సెక్షన్ 107 బిఎన్ఎస్ ఎస్ (ప్రాపర్టీ అటాచ్‌మెంట్) కేసులపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సీపీ అవినాష్ మోహంతీ విశేష కృషి చూపిన అధికారులకు ప్రశంస పత్రాలు, నగదు బహుమతులు అందజేశారు.
ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ పి.శైలజ మాట్లాడుతూ..పోలీస్ ప్రాసిక్యూషన్ శాఖల మధ్య సమన్వయం పెరిగితే దోష నిరూపణ రేటు పెరిగి, న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం బలపడుతుందని పేర్కొన్నారు. డిప్యూటీ డైరెక్టర్ డా. పి.మంజులా దేవి మాట్లాడుతూ.."రివార్డ్ మేళాలు” అధికారులు ఉత్తేజంగా పనిచేయడానికి ప్రేరణనిస్తాయని అన్నారు. టి ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ పి.శైలజ, డిప్యూటీ డైరెక్టర్ డా.మంజులా దేవి, డీసీపీ (క్రైమ్స్) ముత్యం రెడ్డి, మాధాపూర్ డీసీపీ రితిరాజ్, మెడ్చల్ డీసీపీ ఎన్.కోటిరెడ్డి, శంషాబాద్ డీసీపీ బి.రాజేష్, రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్ గౌతమ్, వుమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ డీసీపీ సృజన కర్ణం,  అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts

Latest News

కూకట్ పల్లి బాలానగర్ డివిజన్‌లో ఇంద్రనగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు – సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం కూకట్ పల్లి బాలానగర్ డివిజన్‌లో ఇంద్రనగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు – సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం
  కూకట్ పల్లి లోకల్ గైడ్ న్యూస్ : కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరిధిలోని ఇంద్రనగర్ బస్తీ లోకల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో –
కూకట్పల్లి–బాలానగర్ ఇంద్రనగర్ బస్తీ ఎన్నికలు | సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం | అధికారిక ఫలితాలు త్వరలో
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను సన్మానించిన ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి
ఓవర్ లోడ్ వాహనాలతో పొంచి ఉన్న ప్రమాదం.
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : 21 మంది మృతి
గురుకుల విద్యార్థినులపై పోలీసుల దౌర్జన్యం – షాద్‌నగర్‌లో ఉద్రిక్తత
ఫోరెన్సిక్ సైన్స్‌ పై న్యాయవాదులకు అవగాహన తప్పనిసరి