బాధిత ప్రజలకు న్యాయం చేసేందుకు ప్రజల వద్దకే వచ్చిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ...
*ప్రజలు చట్టాలు న్యాయ వ్యవస్థను గౌరవించాలి...
న్యాయ చైతన్యం కలిగించే దిశగా అడుగులు వేసిన నిజామాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ...గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు శృతిమించొద్దు... శృతిమించితే చర్యలు తప్పవు...
న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివి న్యాయమూర్తి జి ఉదయ్ భాస్కర్ రావు...
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్)
గ్రామాభివృద్ధి కమిటీ ఆగడాలను కళ్లెం వేసేందుకు, ఒక చిన్నది ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు న్యాయ చైతన్య సదస్సును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ న్యాయమూర్తి జి. ఉదయభాస్కరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.. ఈ నేపథ్యంలో జక్రాన్ పల్లి మండలం కోలిప్యాక్ గ్రామాభివృద్ధి కమిటీ బాధితుల పట్ల ఇబ్బందులు పడ్డ కుటుంబ సంబంధించి విషయంలో కేసు నమోదైనప్పటికీ పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మరియు గ్రామాభివృద్ధి కమిటీ , బాధిత కుటుంబ సొంత పనులలో కూడా జోక్యం చేస్తూ వారిని పలు విధాలుగా బాధలకు గురి చేస్తున్నట్లు ఓ షెడ్యూల్డ్ కులస్తులకు చెందిన వారు మరియు35 రజక కులస్తులన కుటుంబాలను బహిష్కరించి జరిమానాలు విధించారని తమకు న్యాయం చేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ నిజామాబాద్ ను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు పై స్పందించిన జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ న్యాయమూర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచన మేరకు జక్రాన్ పల్లి మండలం మరియు కోలిప్యాక్ గ్రామాలకు వెళ్లి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులతో పాటు బాధితుల సమస్యలను తెలుసుకొని నిజామాబాద్ ఏసిపి రాజ వెంకట్ రెడ్డి తో మాట్లాడి న్యాయ చైతన్య సదస్సును చట్టాలపై అవగాహనను కల్పించారు... గ్రామాభివృద్ధి కమిటీలు చేసే అరాచకాలు, చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం మంచిది కాదని , ఇలా చేసే ప్రతి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు సూచించారు, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళుతుందని తెలియజేశారు.. గ్రామాభివృద్ధి కమిటీలు తీరు మార్చుకోవాలని సూచించారు. అదేవిధంగా గ్రామ ప్రజలకు చట్టాలపై కూడా అవగాహన కలిగి ఉండాలని తెలియపరిచారు. చట్టాన్ని అతిక్రమించి పనులు చేస్తే చట్టం తన పని తను చేసి వెళ్తుందని సూచించారు.. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ న్యాయమూర్తి జి. ఉదయ్ భాస్కరరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సాయ రెడ్డి, సీనియర్ న్యాయవాది బాసరాజేశ్వర్, న్యాయవాది నర్రా రామారావు, న్యాయవాది పులి జైపాల్ నిజావత్ నగర ఏసిపి రాజ వెంకట్ రెడ్డి మరియు జక్రాన్ పల్లి ఎస్ హెచ్ వో మహమ్మద్ మాలిక్, ఎంపీడీవో శ్రీధర్ కుమార్ ఎంపీ ఓ యూసుఫ్ ఖాన్ ఏపిఎం రవీందర్, సోషల్ వర్కర్ బంగారి సాయిలు, షేక్ హుస్సేన్, ప్యానల్ న్యాయవాది రాజేశ్వర్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు...
About The Author
Related Posts
