అప్పుడే పుట్టిన శిశువును చీకట్లో పారవేసిన వేసిన తల్లి కుటుంబ సభ్యులు...
శిశువు ఏడుపు శబ్దంతో అక్కున చేర్చుకొని ఆస్పత్రికి తరలించిన స్థానికులు...
శిశు విక్రయం ఘటన మరువకముందే సభ్య సమాజం తరలించుకుని మరో ఘటన...ఈ ఘాతకానికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు..
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) గత రెండు రోజుల క్రితం నవజాత ఆడ శిశువును విక్రయించిన ఘటన మరువక ముందే మరో శిశువును పారవేసిన ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించింది..అప్పుడే పుట్టి కళ్లు కూడా తెరువని పసికందును ఓ ఇంట్లో పారవేసి చేతులు దులుపరించుకునే యత్నం చేశారు కన్న తల్లితో పాటు మిగిలిన కార్కటకులు... పక్కింట్లో వారికి పాప ఏడుపు శబ్దం వినబడడంతో ఇంటి ఆవరణలో అప్పుడే పుట్టిన పసికందు కనబడడంతో ఒక్కసారిగా కంగుతిన్నట్టు వాపోయారు...వెంటనే అక్కున చేర్చుకొని పాలు తాగించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శిశువును నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు స్థానికులు తెలిపారు.. స్థానికులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి..
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సభ్య సమాజం తలదించుకునే మరో ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో అప్పుడే పుట్టిన నవజాత ఆడ శిశువును మంగళవారం రాత్రి చీకట్లోనే పారవేసి చేతులు దులుపరించుకునే యత్నం చేశారు... కానీ చిన్నారి ఏడుపు శబ్దంతో ప్రయత్నం విఫలమైన ఘటన మంగళవారం రాత్రి నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నాలుగో ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
పద్మనగర్ వంద ఫీట్ల రోడ్డుకు వెళ్లేదారిలో ఓ యువతి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్టు స్థానికులు పేర్కొంటున్నారు. కానీ, ఆ చిన్నారిని వదిలించుకోనే ప్రయత్నం చేసినట్టు స్థానికులు పేర్కొంటున్నారు.. ఈ క్రమంలో ఓ ఇంట్లో నుండి ఒక గోడ మీద నుండి తమ ఇంట్లో శిశువును పాడవేసినట్టు గోడపై రక్తపు మరకలు సైతం ఉన్నట్టు వారు తెలిపారు.. స్థానికులు గమనించి దగ్గరకు తీసుకొని చీకట్లో గుక్కపట్టి ఏడవడాన్ని చూసి చలించి పాపకు పాలు పట్టి అనంతరం పోలీసులకు సమాచారమిచ్చినట్టు తెలిపారు... పోలీసుల సహకారంతో చిన్నారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, పెళ్లి కాని యువతి గర్భం దాల్చి, ఇలా పసికందును కని వదిలేసినట్లు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట రెడ్డి తెలిపారు. చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతోందన్నారు. బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు..గత రెండు రోజుల క్రితం రెండు లక్షల రూపాయలకు ఆడ శిశువును విక్రయించిన ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకోవడంతో పాటు వరుస ఘటనలతో ఇవేం ఘటనలని నగర ప్రజలు విస్తుపోతున్నారు..
About The Author
Related Posts
