అక్రమ తవ్వకాలు వెంటనే ఆపాలి

అక్రమ తవ్వకాలు వెంటనే ఆపాలి

 *మా పట్టా భూమిలో దౌర్జన్యంగా మట్టినీ తరలిస్తున్న వైనం*

*ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు*

*త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రిని, శాసనసభాపతిని కలిసి నా సమస్యను వివరిస్తా*

 *బాధిత రైతు మహమ్మద్  ఖలీల్ ఆవేదన* 

వికారాబాద్ జిల్లా,లోకల్ గైడ్:

వికారాబాద్ జిల్లా ధారూర్ మండల పరిధిలోని అంతారం గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు, అతని అనుచరులు కలిసి తన భూమిలో  అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారని రైతు మహమ్మద్ ఖలీల్ అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని క్లబ్ ఫంక్షన్ హాల్ లో సర్బన్ పల్లి  గ్రామానికి చెందిన మహమ్మద్ ఖలీల్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  ధరూర్ మండలం అంతారం గ్రామంలో గల సర్వే నెంబర్ 29,30,31,33,40,42 లలో 35 ఎకరాలు భూమిని గతంలో కొనుగోలు చేశానని అన్నారు.మా భూమిలో అక్రమంగా అధికార పార్టీ సర్వేనెంబర్ 30, 33లలో ఎకర 20 గుంటలలో మైనింగ్ జరుపుతూ మమ్మల్ని ఆయన అనుచరులతో కలిసి బెదిరిస్తున్నారని ఆవేదనను వ్యక్తం చేశారు. ఇట్టి విషయం ధరూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కు ఫిర్యాదు చేసిన పట్టించుకోక పోవడంతో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశానని అన్నారు.ఉన్నతాధికారులు స్పందించడం లేదని, అధికార పార్టీ నాయకులకు అండగా నిలుస్తున్నారని అన్నారు. డయల్ 100 కు కాల్ చేయగా ధరూర్ సిఐ ఎఫ్ ఐ ఆర్ నెంబర్ (16)2025 ఎఫ్ఐఆర్ చేశారనీ , ఇప్పటివరకు అక్రమ మైనింగ్ తవ్వకాలు ఆపడం లేదని, మండల తహసిల్దార్ కు పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి మైనింగ్ మాఫియా నుండి తన భూమి తనకు అప్పగించాలని ఆయన అన్నారు. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని అన్నారు. ఈ మీడియా సమావేశంలో న్యాయవాది రవికుమార్,మహమ్మద్ ఆదిల్ అక్తర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts

Latest News

నాణ్యమైన ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం- తహసీల్దార్ వెంకటేశ్ ప్రసాద్. నాణ్యమైన ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం- తహసీల్దార్ వెంకటేశ్ ప్రసాద్.
విద్యార్థులతో సహపంక్తి భోజనం.*లోకల్ గైడ్/ తాండూర్:* నాణ్యమైన ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని పెద్దేముల్ తహసిల్దార్ వెంకటేష్ ప్రసాద్ పేర్కొన్నారు.బుధవారం, మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి...
అక్రమ తవ్వకాలు వెంటనే ఆపాలి
*గవర్నర్ చేతుల మీదుగా అలూర్ వాసికి డాక్టరేట్ పట్టా 
అప్పుడే పుట్టిన శిశువును చీకట్లో పారవేసిన వేసిన తల్లి కుటుంబ సభ్యులు...
ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంట 
ఘనంగా పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
బీడీ వర్కర్స్ కాలనీలో చిరుత సంచారం...