తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ...

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ...

స్నేహ సొసైటీ ఎస్.సిద్దయ్య , అందుల పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి...

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) 
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేది బోనాలు అని స్నేహ సొసైటీ సిద్దయ్య, స్నేహ సొసైటీ అందుల పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి  అన్నారు. శుక్రవారం నగరంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ ఆవరణంలో సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మొదట స్నేహ సొసైటీ ఆవరణలో డప్పులతో బోనాలు ఎత్తుకొని నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మహిళలు భక్తి శ్రద్ధలతో  అమ్మ వారికి బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆడపడుచులకు తాంబూళం అందజేసి ఒకరికి ఒకరు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. డప్పు చప్పుళ్లు, నృత్యాల నడుమ మహిళలు తలపై బోనాలు మోసుకుంటూ స్నేహ సొసైటీ నుండి హౌసింగ్ బోర్డు కాలోనీ పోచమ్మ మందిరానికి ఊరేగింపుగా తరలివెళ్లారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఒడిబియ్యం, వస్తాలు, నైవేద్యాలు సమర్పించారు.  నిజామాబాద్ జిల్లా ప్రజలు  సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కులు తీర్చుకున్నారు. జిల్లా ప్రజలు సుభిక్షంగా ఆనందోత్సహాల మధ్య ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని అన్నారు. స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం  బోనాల పండగ నిర్వహించడం ఎంతో శుభ సూచకమని అన్నారు.. అమ్మవారి కృపాకటాక్షాలతో స్నేహ సొసైటీలోని వివిధ విభాగాలలో ఉన్న మానసిక దివ్యాంగ విద్యార్థులు మరియు పనిచేస్తున్న సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, అవరోధాలు లేకుండా ఎలాంటి మహమ్మారిలు రాకుండా చూడాలని కోరారు. సమృద్ధిగా వర్షాలు కురిసి సిరిసంపదలతో విరజిల్లాలని కోరుతూ అమ్మవారికి బోనాలను సమర్పించుకోవడం జరిగిందన్నారు. దేశ రైతులు, సైనికుల తో పాటు ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అందులో మనం ఉండాలని కోరుకున్నారు. ఈ బోనాల కార్యక్రమంలో ట్రాన్స్ జెండర్లు వంశీ ప్రియ, సుచి  మరియు ప్రశాంతిలు బోనాలు ఎత్తుకున్నారు.
ఈ కార్యక్రమంలో  మానసిక దివ్యంగుల పాఠశాల ప్రిన్సిపాల్  రాజేశ్వరి  కోఆర్డినేటర్ కిరణ్మయి స్నేహ టార్గెట్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రాం మేనేజర్ బాలరాజు ట్రాంజెండర్ల నాయకులు జరీనా, గంగా, శ్యామల, ఆరతి, పాల్గొన్నారు. వీరితోపాటు స్నేహ టి ఐ జిఎన్ఎమ్ కౌన్సిలర్ అవుట్ రీచ్ వర్కర్లు, ఫీల్ ఎడ్యుకేటర్లు, మహిళ సెక్స్ వర్కర్లు పాల్గొన్నారు..

Tags:

About The Author

Related Posts

Latest News

బాధిత ప్రజలకు న్యాయం చేసేందుకు ప్రజల వద్దకే వచ్చిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ... బాధిత ప్రజలకు న్యాయం చేసేందుకు ప్రజల వద్దకే వచ్చిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ...
*ప్రజలు చట్టాలు న్యాయ వ్యవస్థను గౌరవించాలి... న్యాయ చైతన్యం కలిగించే దిశగా అడుగులు వేసిన నిజామాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ... గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు శృతిమించొద్దు......
సిద్దిపేటలో మీడియా అకాడమీ శిక్షణా తరగతులు
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ...
నాణ్యమైన ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం- తహసీల్దార్ వెంకటేశ్ ప్రసాద్.
అక్రమ తవ్వకాలు వెంటనే ఆపాలి
*గవర్నర్ చేతుల మీదుగా అలూర్ వాసికి డాక్టరేట్ పట్టా 
అప్పుడే పుట్టిన శిశువును చీకట్లో పారవేసిన వేసిన తల్లి కుటుంబ సభ్యులు...