ఖానాపూర్ మున్సిపల్ చైర్మెన్ ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి:

జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు.

ఖానాపూర్ మున్సిపల్ చైర్మెన్ ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి:

నిర్మల్ జిల్లా . ప్రతినిధి (లోకల్ గైడ్):ఏప్రిల్ …1


   ఈనెల నాలుగవ తేదీన (శనివారం) ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. 
   మంగళవారం ఆయన, ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయంలో, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లపై  సమావేశం నిర్వహించారు. 
   ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. ఎన్నికైన కౌన్సిలర్లకు పార్టీల వారిగా సీటింగ్ ఏర్పాటు చేసి, త్రాగునీరు అందించాలని పేర్కొన్నారు. తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని వివరించారు. మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. 
    జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టి, తొలిసారి ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయానికి వచ్చినందున అదనపు కలెక్టర్ ను, మున్సిపల్ కమిషనర్, తదితర అధికారులు శాలువాతో సన్మానించారు. 
    ఈ సమావేశంలో సీపీవో జీవరత్నం, మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, తహసిల్దార్ సుజాత, ఎంపీడీవో రమాకాంత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News