అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.

గ్రామ అభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాల కోసం సంఘం

అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.

లోకల్ గైడ్/బంట్వారం:
బంట్వారం మండలంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మరియు బాబు జగ్జీవన్ రామ్,యువజన సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. గ్రామ అభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాల కోసం సంఘం మరింత చురుకుగా పనిచేయాలనే లక్ష్యంతో ఈ ఎన్నికలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సంఘం అధ్యక్షుడు దొరిటి సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ..అంబేద్కర్ ఆశయాల సాధనలో సంఘం ఎల్లప్పుడూ ముందుండి సేవలు అందిస్తుందని తెలిపారు. గ్రామ అభివృద్ధికి యువత భాగస్వామ్యం అత్యంత అవసరమని, సభ్యులందరి సహకారంతో సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని అన్నారు.
తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్న వ్యవస్థాపక కమిటీ సభ్యులకు, ప్రస్తుత సభ్యులకు, గ్రామ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సంఘ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని కోరారు.నూతన కమిటీలో అధ్యక్షుడిగా, దొరిటి సుధాకర్, ఉపాధ్యక్షుడిగా, పోచారం రాములు, కార్యదర్శిగా భూషణగారి రమేష్, జనరల్ సెక్రటరీగా, సిరంపురం ప్రభాకర్, కోశాధికారిగా, పిల్లికాండ్ల కృష్ణ, సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా, బర్వాద్ రవీందర్ ను నియమించారు.ఈ కార్యక్రమంలో యువకులు, గ్రామస్థులు, తదితరులు, పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

తుర్మామిడి గ్రామంలో రంజాన్ తోఫాల పంపిణీ. తుర్మామిడి గ్రామంలో రంజాన్ తోఫాల పంపిణీ.
లోకల్ గైడ్/బంట్వారం: పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా బంట్వారం మండల పరిధిలోని తుర్మామిడి గ్రామంలో బుధవారం ముస్లిం మహిళలకు రంజాన్ తోఫాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు....
నర్మెట్టలో రైతు ఉత్సవాలకు ఘన ప్రారంభం
_శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది కవి పద్య సమ్మేళనం ఘనంగా
అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.
నూతన తెలుగు సంవత్సరము ను పురస్కరించుకుని
సర్వారం గ్రామంలో బస్సు రోజు వీర బ్రహ్మచారి గుండెపోటుతో మృతి. 
రేపే రైతు మేళా ప్రారంభం – ఏర్పాట్లలో అధికారుల బిజీ