గ్రామాల్లో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

నారాయణపేట మార్చి 6:

గ్రామాల్లో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నారాయణపేట టౌన్ ఎస్సై వెంకటేశ్వర్లు,రూరల్ ఎస్సై రాముడు తెలిపారు.
జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు నారాయణ పేట మండల పరిధిలోని సర్పంచులు, గ్రామ పెద్దలు, దేవాలయాల ఆర్గనైజర్స్‌తో నారాయణపేట టౌన్ ఎస్సై వెంకటేశ్వర్లు, రూరల్ ఎస్సై రాముడు పోలీస్ స్టేషన్లో ప్రత్యేక సమావేశం నిర్వహిం చి గ్రామాల్లో భద్రత పై దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ గ్రామాల్లో శాంతి భద్రత పరిరక్షణలో సర్పంచులు, గ్రామ పెద్దలు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించా లని కోరారు. గ్రామాల్లో భద్రతను బలోపేతం చేయ డానికి సీసీ కెమెరాలు ఏర్పా టు చేసుకోవాలని సూచించారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయో గకరంగా ఉంటాయని తెలిపారు.ఇటీవల దేవాల యాల్లో జరుగుతున్న దొంగతనాల నేపథ్యంలో గ్రామాల్లోని దేవాలయాల వద్ద ప్రత్యేకంగా లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని మరియు విలువైన ఆభరణాలు ఉంటే బ్యాంకు లాఖరులో ఉంచాలని ఉత్సవాల సమయంలో తీసుకోవాలని తెలిపారు. అలాగే గ్రామాలలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు గ్రామాలకు వచ్చినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే గ్రామాల్లో శాంతి భద్రత పరిరక్షణకు గ్రామ ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.
ఈ సమావేశంలో సర్పంచులు, గ్రామ పెద్దలు, దేవాలయాల నిర్వాహకులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:6.సమావేశంలో మాట్లాడుతున్న ఎస్సై 
_____________________

Tags:

About The Author

Latest News

తుర్మామిడి గ్రామంలో రంజాన్ తోఫాల పంపిణీ. తుర్మామిడి గ్రామంలో రంజాన్ తోఫాల పంపిణీ.
లోకల్ గైడ్/బంట్వారం: పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా బంట్వారం మండల పరిధిలోని తుర్మామిడి గ్రామంలో బుధవారం ముస్లిం మహిళలకు రంజాన్ తోఫాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు....
నర్మెట్టలో రైతు ఉత్సవాలకు ఘన ప్రారంభం
_శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది కవి పద్య సమ్మేళనం ఘనంగా
అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.
నూతన తెలుగు సంవత్సరము ను పురస్కరించుకుని
సర్వారం గ్రామంలో బస్సు రోజు వీర బ్రహ్మచారి గుండెపోటుతో మృతి. 
రేపే రైతు మేళా ప్రారంభం – ఏర్పాట్లలో అధికారుల బిజీ