రేపే రైతు మేళా ప్రారంభం – ఏర్పాట్లలో అధికారుల బిజీ

150 స్టాళ్లను పరిశీలించిన కలెక్టర్ హైమావతి

రేపే రైతు మేళా ప్రారంభం – ఏర్పాట్లలో అధికారుల బిజీ

IMG-20260318-WA0280సిద్దిపేట జిల్లా ప్రతినిధి మార్చి18(లోకల్ గైడ్ తెలంగాణ):
నంగునూరు మండలం నర్మెట్టలో నిర్మితమైన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం మరియు రైతు మేళా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ నెల 22న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఫ్యాక్టరీ ప్రారంభం జరగనుండగా, 19న రాష్ట్ర మంత్రులు రైతు మేళాను ప్రారంభించనున్నారు.బుధవారం సంబంధిత అధికారులతో కలిసి ఫ్యాక్టరీ ప్రాంగణాన్ని సందర్శించిన కలెక్టర్ హెలిప్యాడ్, బహిరంగ సభ వేదికతో పాటు రైతు మేళా కోసం ఏర్పాటు చేస్తున్న 150 స్టాళ్లను పరిశీలించారు.వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మార్క్‌ఫెడ్, ఫిషరీస్, నాబార్డ్, విజయ డైరీ, బ్యాంకులు, సహకార సంస్థలు తదితర శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ స్టాళ్లలో రైతులకు ఉపయోగపడే పరికరాలు, నమూనాలు, లైవ్ స్టాక్ ప్రదర్శనలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు.19 నుంచి 22 వరకు నిర్వహించే ఈ రైతు మేళాను ప్రతిరోజూ 3,000–5,000 మంది రైతులు సందర్శించే అవకాశముండటంతో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపారాణి, ఉద్యానవన అధికారి సువర్ణ, పశుసంవర్ధక శాఖ అధికారి కొండల్ రెడ్డి, డిఆర్డీఓ జయదేవ్ ఆర్య, ఫ్యాక్టరీ మేనేజర్ శ్రీకాంత్, ఆర్ అండ్ బి, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు తదితరులు పాల్గొనారు

Tags:

About The Author

Latest News

రేపే రైతు మేళా ప్రారంభం – ఏర్పాట్లలో అధికారుల బిజీ రేపే రైతు మేళా ప్రారంభం – ఏర్పాట్లలో అధికారుల బిజీ
సిద్దిపేట జిల్లా ప్రతినిధి మార్చి18(లోకల్ గైడ్ తెలంగాణ):నంగునూరు మండలం నర్మెట్టలో నిర్మితమైన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం మరియు రైతు మేళా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె....
సర్పంచ్‌ల శిక్షణలో అదనపు కలెక్టర్ మార్గదర్శనం –
నవోదయ ఫలితాల్లో మెరిసిన చైతన్య విశ్వభారతి స్కూల్ విద్యార్థి 
కారేపల్లి మంటిసోరి స్కూల్ లో ఉగాది సంబరలు ఘనంగా 
ఘనంగా భోసి పాఠశాలలో ఉగాది సంబరాలు. 
15వ వార్డులో రంజాన్ కానుకలు పంపిణీ...
రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక