అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన ...

శుక్రవారం అన్న ప్రాసన కార్యక్రమం  నిర్వహించారు.

అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన ...

బెల్లంపల్లి (లోకల్ గైడ్)


మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని 31వ వార్డు మొహమ్మద్ ఖాసిం బస్తీలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు శుక్రవారం అన్న ప్రాసన కార్యక్రమం  నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కౌన్సిలర్ బండారి స్రవంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె చిన్న పిల్లలకు అన్నప్రాసన చేసి,పలువురు గర్భిణులు,బాలింతలకు,పిల్లలకు కోడిగుడ్లు బాలమృతం పంపిణీ చేసారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు చిన్నారులకు అంగన్వాడి పాఠశాలల్లో ఆరోగ్యకరమైన ఆహారం అందించడమే కాకుండా మంచి విద్యను అందిస్తున్నారని అన్నారు.తల్లిదండ్రులు చిన్నారులను అంగన్వాడి కేంద్రాలలో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పాటును అందించి సహకరించాలని ఆమె కోరారు.అనంతరం అంగన్వాడీ టీచర్ ఒడ్డేపల్లి రాజేశ్వరి నూతన కౌన్సిలర్ ను శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సహాయకులు సునీత,బస్తీ వాసులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి  రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి 
చర్ల : లోకల్ గైడ్ :రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ కన్వీనర్ దొడ్డి తాతారావురాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే...
మెనూ పక్కాగా అమలు చేయాలి:జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా
టెక్నీషియన్  కోర్సులకు  దరఖాస్తుల ఆహ్వానం .
కారేపల్లి రైల్వే గ్యాంగ్  హోలీక దిల్ ఖుష్ 
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలి 
శ్రీ భద్రకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు
ప్లాటినం జూబ్లీ వేడుకలలో గౌరవ అతిధిగా హాజరు కావాలని ఆహ్వానం